ఖమ్మం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులుగా సీనియర్ న్యాయవాదులైన మందడపు శ్రీనివాసరావు, పి.సంధ్యారాణితో పాటు సామాజిక కార్యకర్త డాక్టర్ డి.పూర్ణచంద్రరావులను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవాసంస్థ అధ్యక్షులుగా జిల్లా జడ్జి వ్యవహరిస్తుండగా, కలెక్టర్, సీపీ, చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, ప్రభుత్వ న్యాయవాదులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. వీరితో పాటు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, న్యాయ సేవాసంస్థ కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న వారిని సభ్యులుగా నియమిస్తారు. ఇందులో భాగంగానే వీరిని నియమించగా రెండేళ్ల పాటు సభ్యులుగా కొనసాగనున్నారు.
సబ్‌జైల్ సూపరింటెండెంట్‌గా కుటుంబరాజు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి సబ్‌జైలు సూపరింటెండెంట్‌గా ఉబ్బల కుటుంబరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. మధిర సబ్‌జైల్ సూపరింటెంటెండ్‌గా ఉన్న ఆయనను ఇక్కడకు బదిలీపై చేశారు. ఈనెల 11న సత్తుపల్లి సబ్‌జైల్ నుంచి రిమాండ్ ఖైదీ పరారు కాగా, బాధ్యులుగా సూపరింటెండెంట్ సోమరాజు సంపత్, వార్డర్లను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ స్థానంలో నియమితులైన కుటుంబరాజు విధుల్లో చేరారు.
ఆరేళ్ల క్రితం ఒకరు.. ఇప్పుడు ఇంకొకరు
● ఇద్దరు కుమారుల మృతితో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
కారేపల్లి: స్నేహితులతో కలిసి సంతోషంగా హోలీ ఆడిన బాలుడు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మండలంలోని దుబ్బతండాకు చెందిన బానోత్ రమేశ్–శైలజ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారుడికి రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆరేళ్ల క్రితం జ్వరంతో మృతి చెందాడు. ఇక పెద్ద కుమారుడు సాయికృష్ణ(12) కారేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా 20రోజుల క్రితం జ్వరం వచ్చింది. చికిత్స అనంతరం కోలుకుని పాఠశాలకు వెళ్తుండగా ఈ నెల 14వ తేదీన హోలీ వేడుకల్లో స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు. ఈక్రమాన శనివారం సాయికృష్ణ అస్వస్థతకు గురి కాగా, స్థానిక ఆస్పత్రిలో చూపించి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం ఒకరు, ఇప్పుడు ఇంకో కుమారుడు మృతి చెందడంతో రమేశ్–శైలజ గుండెలవిసేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
సేవా లోపంపై
ట్రావెల్స్ సంస్థకు జరిమానా
ఖమ్మం లీగల్: సేవా లోపం కింద హైదరాబాద్‌కు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం రూ.35వేలు చెల్లించాలంటూ ఖమ్మం జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎం.మాధవీలత శనివారం తీర్పునిచ్చారు. వివరాలిలా.. ఖమ్మం వాసి వనం నీతు గత ఏడాది ఏప్రిల్ 15న కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు నుంచి ఖమ్మం వచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ ఏసీ బస్సులో రూ.8,032 చెల్లించి టికెట్లు బుక్ చేసింది. ఖమ్మం వస్తుండగా మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తగా బస్సు నిలిచిపోయినా యాజమాన్యం స్పందించలేదు. మూడు గంటలపాటు రోడ్డుపైనే ఉన్నా క రూ.7వేలకు క్యాబ్ మాట్లాడుకుని ఖమ్మం వచ్చారు. ఆపై న్యాయవాది చార్లెస్ వినయ్ ద్వారా వినియోదారుల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించగా టికెట్ రుసుము రూ.8,032తో పాటు ఏడు శాతం వడ్డీ, క్యాబ్ చార్జీ రూ.7వేలు, మనోవేదనకు గురైనందుకు రూ.10వేలు, లిటిగేషన్ ఖర్చుల కింద రూ.10వేలు కలిపి రూ.35 వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు.
జిల్లా న్యాయ సేవాసంస్థ సభ్యుల నియామకం
జిల్లా న్యాయ సేవాసంస్థ సభ్యుల నియామకం
జిల్లా న్యాయ సేవాసంస్థ సభ్యుల నియామకం