ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధి పాఠశాలలు ఈనెల 15వ తేదీ శనివారం ఒకటే పూట కొనసాగనున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకోగా, అన్ని పాఠశాలల్లో అమలుచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.సోమశేఖరశర్మ సూచించారు. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని, ఆతర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తెలిపారు. కాగా, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న పాఠశాలలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు.
16న అథ్లెటిక్స్
ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 16న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. అండర్–14, 16, 18, 20, పురుషులు మహిళల విభాగాల్లో 100, 400, జవాలీన్‌త్రో అంశాల్లో పోటీలు ఉంటాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షపీక్ అహ్మద్ తెలిపారు. క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
15వ బెటాలియన్
కమాండెంట్‌గా పెద్దబాబు
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం గంగా రంలోని 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా ఎన్. పెద్దబాబు గురువారం బాధ్యతలు స్వీకరించా రు. యాపలగడ్డలోని రెండో బెటాలియన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు అసిస్టెంట్ కమాండెంట్ ఎస్.శ్రీధర్‌రాజు, ఎస్‌డీ రంగారెడ్డి, అధికారులు స్వాతం పలికారు. 1991వ బ్యాచ్‌కు చెందిన పెద్దబాబు యాపలగడ్డలోని రెండో బెటాలియన్‌లో అడిషనల్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా కమాండెంట్‌గా పదోన్నతి కల్పించి గంగారం బదిలీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ కమాండెంట్‌గా ఉన్న పీజేపీసీ.చటర్జీ హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు బదిలీ అయ్యారు.
హోలీ సందర్భంగా ఆంక్షలు
ఖమ్మంక్రైం: చిన్నాపెద్ద తేడా లేకుండా జిల్లావాసులు శుక్రవారం హోలీ పండుగ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, పండుగను సంబురంగా జరుపుకునే క్రమాన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిటీ పోలీస్ యాక్ట్ ద్వారా శుక్రవారం ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలే తప్ప రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా వ్యవహరిస్తే వాహనాలు సీజ్ చేస్తామని పేర్కొన్నారు. పరిచయం లేని వ్యక్తులపై రంగులు చల్లినా, గొడవలు సృష్టించినా చర్యలు తప్పవన్నారు. అలాగే, ప్రధాన కూడళ్లు, సాగర్ కెనాల్, మున్నేరు, ఇతర రిజర్వాయర్ల వద్ద బందోబస్తు ఉంటుందని తెలిపారు. అంతేకాక కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, వైన్స్ బార్లలో సాయంత్రం 6గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నందున షాపులు తెరిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.
విధుల్లోకి
జూనియర్ లెక్చరర్లు
ఖమ్మం సహకారనగర్: ఇటీవల జూనియర్ లెక్చరర్లుగా ఎంపికై న వారికి ఇటీవల హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందజేశారు. ఇందులో జిల్లాకు 57మంది లెక్చరర్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు వీరంతా విధుల్లో చేరుతున్నారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. లెక్చరర్ల రాకతో కళాశాలల్లో సబ్జెక్ట్ అధ్యాపకుల కొరత తీరనుందని పేర్కొన్నారు.
జిల్లా కోర్టులో సౌర విద్యుత్
ఖమ్మం లీగల్: జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్యానళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపై అందరూ దృష్టి సారించాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించినట్లవుతుందని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కోర్టులో సౌర విద్యుత్ వినియోగానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి హరికృష్ణ, ఉద్యోగలు రాధేశ్యామ్, ఓంకార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నేరెళ్ల శ్రీనివాస్, చింత నిప్పు వెంకట్ తదితరలు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఒంటి పూట బడులు
రేపటి నుంచి ఒంటి పూట బడులు