రెండు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు | - | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు

Mar 12 2025 8:09 AM | Updated on Mar 12 2025 8:04 AM

ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో అంకమ్మ తల్లి, అక్కమ్మ పేరంటాల శ్రీరామలింగయ్య స్వామి తిరునాళ్ల సందర్భంగా మంగళవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల స్థాయి న్యూ జూనియర్స్‌ ఎడ్ల పూటీ పందేలు నిర్వహించారు. ఈ పోటీల్లో వరుసగా ఐదు బహుమతులను ఏపీలోని గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు(రూ.30వేలు), బాపట్ల జిల్లా చిన్నగంజాంకు చెందిన ముంగర విజయలక్ష్మి(రూ.25ఏలు), కృష్ణా జిల్లా కొత్తపాలెంకు చెందిన ముత్తి నాని(రూ.20వేలు), బాపట్ల జిల్లా పెద్దపూడికి చెందిన ఆళ్ల హరికృష్ణ(రూ.17వేలు), బాపట్ల జిల్లా జజిరకి చెదిన యలమందల గోపాలకృష్ణ(రూ.15వేలు)కు చెందిన ఎడ్లు గెలుచుకున్నాయి. కాగా, సీనియర్స్‌ ఎడ్ల పూటీ పందేలు బుధవారం నిర్వహించనున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ పూజారి వేమిరెడ్డి వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గాయపడిన కానిస్టేబుల్‌కు పరామర్శ

ఖమ్మంక్రైం: సత్తుపల్లిలో పారిపోతున్న దొంగను పట్టుకునే క్రమాన కత్తి పోట్లకు గురై ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ మల్లెల నరేష్‌ను పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన ఆయన, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

ఎకై ్సజ్‌ ఉద్యోగులకు రివార్డులు

ఖమ్మంక్రైం: గంజాయి రవాణా, అమ్మకం కేసుల్లో నిందితుల అరెస్ట్‌, శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టిన ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎకై ్సజ్‌ ఉద్యోగులు రివార్డులు అందుకున్నారు. వీరిని హైదరాబాద్‌లో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ గణేష్‌, ఖమ్మం, కొత్తగూడెం ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్లు నాగేందర్‌రెడ్డి, జానయ్య, మణుగూరు, భద్రాచలం సీఐలు రాజిరెడ్డి, రహీమున్నీసాబేగంతో పాటు రాజు, సర్వేశ్వరరావు, రవికుమార్‌, కానిస్టేబుళ్లు మారేశ్వరావు, నాగేశ్వరరావు, పగిడిపర్తి గోపి రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

రోడ్డుప్రమాదంలో

వ్యక్తి మృతి

తిరుమలాయపాలెం: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌.. బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఏనెకుంటతండాకు చెందిన సుమన్‌నాయక్‌(30) మోటార్‌ సైకిల్‌పై కాకరవాయి వెళ్లి ఇంటికి వస్తుండగా కూలీలను దించేందుకు వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమన్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య సునీత, 45 రోజుల కుమారుడు ఉన్నాడు. కూలీ పనులతో జీవనం సాగించే ఆయన మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోగా, సుమన్‌ మృతదేహం వద్ద సునీత రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.

బల్లేపల్లి వద్ద ఒకరు...

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మంలోని బల్లేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రఘునాథపాలెంకు చెందిన రేవూరి సాయిప్రసాద్‌(35) గత నెల 26న ఖమ్మంలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈఘటనలో గాయపడిన ఆయనకు ఖమ్మం చికిత్స అనంతరం హైదరాబాద్‌ తరలించగా మృతి చెందాడు. ఈమేరకు సాయిప్రసాద్‌ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాశ్‌ తెలిపారు.

యువతిపై అత్యాచారం

చింతకాని: మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి సమీప గ్రామానికి చెందిన ఒక యువతిపై అత్యాచారం చేశాడు. ఈనెల 7వ తేదీన యువతిని బలవంతంగా బయటకు తీసుకెళ్లిన ఆయన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement