వైరల్‌ ఫీవర్‌తో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వైరల్‌ ఫీవర్‌తో వ్యక్తి మృతి

Mar 11 2025 12:22 AM | Updated on Mar 11 2025 12:20 AM

పెనుబల్లి: మండలంలోని యడ్లబంజర్‌ గ్రామానికి చెందిన రైతు బన్నే శ్రీనివాసరావు (35) వైరల్‌ ఫీవర్‌ బారిన పడి మృతి చెందాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనను ఆదివారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలింగా వైరల్‌ ఫీవర్‌గా నిర్ధారించి చికిత్స చేస్తుండగానే సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

నేలకొండపల్లి: రోడ్డుప్రమాదంలో గాయపడిన మండలంలోని ఆరెగూడెంకు చెందిన కొమ్మినేని జగ్గయ్య(86) చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేలకొండపల్లి శివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయనను హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే సోమవారం మృతి చెందాడు. జగ్గయ్యకు భార్య, ఇరువురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ఆయన మృతదేహం వద్ద మార్కెట్‌ చైర్మన్‌ వెన్నపూసల సీతారాములుతో పాటు శాఖమూరి రమేష్‌, వడ్డె జగన్‌, మార్తి సైదయ్య, కె.భాస్కర్‌రావు తదితరులు నివాళులర్పించారు.

స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకుడు మృతి

ఖమ్మంరూరల్‌: మండలంలోని బారుగూడెం పరిధి శ్రీ సిటీకి చెందిన పిట్టల మనీష్‌(31) ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీసిటీకి చెందిన పిట్టల సుధాకర్‌ – నిర్మల పెద్ద కుమారుడు మనీష్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఆళ్లగడ్డలో తన స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్లాడు. ఈక్రమంలోనే మరికొందరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఆళ్లగడ్డ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మనీష్‌ మృతి చెందాడు. కాగా, ఆయనకు గత ఏడాది వివాహం జరగగా భార్యాభర్తలిద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మనీష్‌ తండ్రి ఆర్‌టీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, మృతదేహం మంగళవారం స్వగృహానికి చేరుకుంటుందనే సమాచారం అందగా, మనీష్‌ మృతి చెందినట్లు తెలియడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆటో బోల్తా, 14 మంది కూలీలకు గాయాలు

సత్తుపల్లిటౌన్‌: కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోలాపడడంతో 14 మందికి గాయాలయ్యాయి. కాకర్లపల్లికి చెందిన 14 మంది ఉపాధి హామీ కూలీలు సోమవారం ఉదయం సత్తుపల్లి తామర చెరువుమీదుగా కాకర్లపల్లి శివారులోని ఉపాధి పనులకు బయలుదేరారు. తామరచెరువు అలుగు వద్ద ఆటో కట్టపైకి వెళ్లే సమయాన అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో గాయపడిన కూలీలను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, తీవ్రగాయాలైన కె.పుల్లమ్మను ఖమ్మం తీసుకెళ్లారు. క్షతగాత్రులకు ఎంపీడీఓ నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ పరామార్శించారు.

పసికందు విక్రయ కేసులో ముగ్గురికి జైలుశిక్ష

కొత్తగూడెంటౌన్‌: రెండు రోజుల మగ శిశువును విక్రయించిన కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలుశిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కె.సాయిశ్రీ తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా.. 2016లొ కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన నందబాల బాల వరలక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు తమ రెండో కుమారుడు, రెండు రోజుల మగ శిశువును సిరిసిల్లకు చెందిన గాజుల రవీందర్‌కు విక్రయించారు. రూ. 80 వేలకు ఒప్పందం చేసుకోగా, అడ్వాన్స్‌ రూ.50 వేలు ఇచ్చి రవీందర్‌ పసికందును తీసుకెళ్లాడు. విషయం తెలియడంతో అప్పటి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పయ్యావుల రమాదేవి కొత్తగూడెం త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. తొమ్మిది మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి ముగ్గురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.విశ్వశాంతి వాదించగా, సీఐ శివప్రసాద్‌, నోడల్‌ ఆఫీసర్‌ జి. ప్రవీణ్‌కుమార్‌, సిబ్బంది అబ్దుల్‌ ఘని, బి.శోభన్‌ సహకరించారు.

వైరల్‌ ఫీవర్‌తో వ్యక్తి మృతి
1
1/2

వైరల్‌ ఫీవర్‌తో వ్యక్తి మృతి

వైరల్‌ ఫీవర్‌తో వ్యక్తి మృతి
2
2/2

వైరల్‌ ఫీవర్‌తో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement