రామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా జడ్జి | - | Sakshi
Sakshi News home page

రామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా జడ్జి

Mar 10 2025 12:27 AM | Updated on Mar 10 2025 12:27 AM

రామదా

రామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా జడ్జి

నేలకొండపల్లి : నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. తొలుత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామదాసు వాడిన బావిని పరిశీలించారు. ఆడిటోరియంలో రామదాసు చరిత్రకు సంబంఽధించిన చిత్రా పటాలను చూసి, ఆయన చరిత్ర గురించి అర్చకులు సౌమిత్రి రమేష్‌కుమారా చార్యులను అడిగి తెలుసుకున్నారు. అనంత రం శ్రీ ఉత్తరేశ్వరస్వామి, శ్రీ వైద్యనాథస్వామి ఆలయాలను సందర్శించారు. ఆ తర్వాత బౌద్ధక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

సౌర విద్యుత్‌ సర్వే

పూర్తి చేయాలి

మంత్రి భట్టి ఆదేశం

ఖమ్మంవ్యవసాయం : జిల్లాలో నిర్దేశించిన సౌర విద్యుత్‌ గ్రామాల్లో సర్వే త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం ఎన్పీడీసీఎల్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇనుగుర్తి శ్రీనివాసా చారి ఆదివారం హైదరాబాద్‌లో భట్టిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. నిర్ణయించిన గ్రామాల్లో సోలార్‌ సర్వే పూర్తి చేసి టెండర్లు పిలవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.

రామయ్యకు పుష్పార్చన

భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

కిన్నెరసానిలో

పర్యాటకుల సందడి

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. డ్యామ్‌ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 338 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.11,410, 250 మంది బోటింగ్‌ చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.11,970 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

రామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా జడ్జి1
1/2

రామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా జడ్జి

రామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా జడ్జి2
2/2

రామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా జడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement