మహా శివరాత్రికి ఆలయాల్లో సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

మహా శివరాత్రికి ఆలయాల్లో సౌకర్యాలు

Feb 9 2025 12:24 AM | Updated on Feb 9 2025 12:24 AM

మహా శివరాత్రికి ఆలయాల్లో సౌకర్యాలు

మహా శివరాత్రికి ఆలయాల్లో సౌకర్యాలు

ఖమ్మంగాంధీచౌక్‌: మహాశివరాత్రి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఆలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.వీరస్వామి సూచించారు. ఖమ్మంలోని కార్యాలయంలో వివిధ ఆలయాల ఈఓలు, అర్చకులతో శనివారం ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ ఈనెల 26న జరిగే మహాశివరాత్రి వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరు కానున్నందున చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయడమే కాక తాగునీరు, వైద్యసదుపాయాలు కల్పించాలని సూచించారు. అలాగే, భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ వెంకటేశ్వర్లు, ఈఓలు కొత్తూరు జగన్మోహన్‌రావు, సమత, వీ.వీ.నర్సింహారావు, నలమోతు శేషయ్య, చుండూరు రామకోటేశ్వరరావు, సుదర్శన్‌, కె.వేణుగోపాలాచార్యులు, హరిచంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌

వీరస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement