ఖమ్మంక్రైం: రవాణా శాఖలో ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర రవాణాశాఖా కమిషనర్ ఇలంబరిది ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. నిరంతరం తనిఖీల ద్వారా ఆదాయం పెంచడమే కాక రవాణాశాఖా కార్యాలయాల్లో వాహనదారులకు పారదర్శకంగా సేవలు అందించాలని తెలిపారు. అలాగే, దళారులను కార్యాలయాల్లోకి అనుమతించవద్దని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఖమ్మం ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ వెంకటరమణ, భద్రాద్రి కొత్తగూడెం ఆర్‌టీఓ తోట కిషన్‌రావు తదితరులు హాజరయ్యారు.