తీన్మార్‌ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

తీన్మార్‌ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

May 18 2024 2:25 AM | Updated on May 18 2024 2:25 AM

తీన్మ

తీన్మార్‌ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఖమ్మంవన్‌టౌన్‌: ఖమ్మం – నల్లగొండ – వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 27న జరగనుండగా కాంగ్రెస్‌ అభ్యర్ధి తీన్మార్‌ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మండలాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా మల్లన్నకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా ప్రచా రం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సూరంశెట్టి కిషోర్‌, గాలి దుర్గారావు, భూక్యా బాలాజీ, చంద్ర ప్రకాష్‌, నరేందర్‌, సుధాకర్‌, శివ, వేణు, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఖమ్మం డిపోలో

విజయోత్సవం

ఖమ్మంమయూరిసెంటర్‌: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నడిపిన బస్సుల ద్వారా అత్యధిక ఆదాయం సాధించడంతో ఖమ్మం డిపో ఉద్యోగులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా ఉద్యోగులకు స్వీట్లు అందజేశారు. డిపో ద్వారా 3.12 లక్షల కి.మీ. బస్సులు నడిపించడంతో రూ.2కోట్ల ఆదాయం సమకూరడమే కాక 99శాతం ఓఆర్‌తో ఖమ్మం డిపో మొదటి స్థానంలో నిలిచిందని డీఎం శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 14న 109, 15న 105, 16న 104 శాతం ఓఆర్‌ నమోదైందని చెప్పారు. ఈవిషయంలో డ్రైవర్‌, కండక్టర్లతో పాటు ఉద్యోగి పాత్ర కీలకమని ఆయన అభినందించారు.

రాళ్ల దాడిలో పోలీస్‌ పెట్రోకార్‌ ధ్వంసం

ఖమ్మంక్రైం: మద్యం మత్తులో గొడవ పడిన ఇద్దరు విసిరిన రాళ్లు పడడంతో ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన పెట్రోకార్‌ ధ్వంసమైంది. పోలీసుల కథనం ప్రకా రం.. జనగామకు చెందిన హరీష్‌, ఆయన స్నేహితుడు అలీ కాల్వొడ్డులోని బైపాస్‌ ప్రాంతం బార్‌లో గురువారంరాత్రి మద్యం తాగారు. ఆతర్వాత వీరిద్దరు ఘర్షణ పడుతుండగా పోలీసులకు సమాచారం అందటంతో పెట్రోకార్‌లో వచ్చారు. కాగా, హరీశ్‌, అలీ పోలీసుల ఎదుటే రాళ్లతో దాడి చేసుకోగా రాళ్లు పడడంతో పోలీసుల పెట్రోకార్‌ అద్దాలుమయ్యాయి. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వృద్ధురాలిపై దాడి..

ఆభరణాలు చోరీ

ఖమ్మంఅర్బన్‌: రోడ్డు పక్కన నిలబడిన వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన ఇది. ఖమ్మం మమత రోడ్డులో నివాసముంటున్న 80ఏళ్ల వృద్ధురాలి కుమారులు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆమె రోజులాగే గురువారం సాయంత్రం ఇంటి ఎదుట నిలబడగా, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వృద్దురాలి మెడలో బంగారం చోరీకి యత్నించాడు. ఈక్రమంలోనే ఆమెను నెట్టివేయగా కింద పడడంతో తలకు తీవ్రగాయమైంది. ఆపై వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లినట్లు తెలిసింది. అయితే, ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఖమ్మం అర్బన్‌ పోలీసులు తెలిపారు.

భవనం పైనుంచి పడి మేసీ్త్ర మృతి

ఖమ్మంక్రైం: నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడిన మేసీ్త్ర మృతి చెందాడు. ఖమ్మం త్రీటౌన్‌ సీఐ రమేష్‌ వెల్లడించిన వివరాలు.. ఖమ్మం అగ్రహారానికి చెందిన పాయం వీరస్వామి(45) సుతారీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆయన శ్రీనివాస్‌ నగర్‌లోని ఓ భవనం ప్లాస్టరింగ్‌ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కారు బోల్తా పడడంతో వ్యక్తి..

కూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు సమీ పాన జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున కారు బోల్తా పడిన ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మంలోని పోలీస్‌ హౌసింగ్‌ కాలనీకి చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు(50) తన బంధువును హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేర్చి తిరిగి కారులో వస్తున్నాడు. ఈక్రమాన జీళ్లచెరువు సమీపంలోకి రాగానే అడ్డుగా వచ్చిన గేదెను తప్పించే కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

తీన్మార్‌ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
1
1/1

తీన్మార్‌ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement