
ఖమ్మంవన్‌టౌన్: మజ్జిగ అందజేస్తున్న నిజాంపేట ముస్లిం యూత్ సభ్యులు
కొత్తగూడెంఅర్బన్/దమ్మపేట/ఖమ్మంవన్‌టౌన్: శ్రీ రామనవమి సందర్భంగా ఊరువాడ శ్రీసీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఎండవేడితో ఇబ్బంది పడుతున్న భక్తులకు ముస్లింలు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటారు. కొత్తగూడెంలోని ఉర్దూ ఘర్ వద్ద ముస్లింలు భక్తులకు మజ్జిగ, పానకం పంపిణీ చేశారు. అలాగే, దమ్మపేటలో శ్రీసీతారాముల కల్యాణ వేడుకకు హాజరైన భక్తులకు షేక్ బాషా తాగునీరు అందజేయగా పలువురు అభినందించారు. ఖమ్మం నిజాంపేటకు చెందిన ముస్లిం యువకులు వైరారోడ్డులో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అహ్మద్ అలీ, సోహెయిల్, షకీల్, సిద్ధిఖీ, గౌస్, అజ్జు, మహబూబ్, రెహాన్, నజీబ్, కరీం, ఇర్ఫాన్ పాల్గొన్నారు.