
మాట్లాడుతున్న సిద్ధాంతి మాచిరాజు వేణుగోపాల్
ఖమ్మంగాంధీచౌక్: గురువు అనుగ్రహం ఉంటే అంతా శుభమే జరుగుతుందని హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ అన్నారు. శ్రీ సాయి భజన మండలి సిల్వర్ జూబ్లీ వార్సికోత్సవం ఆదివారం ఖమ్మంలోని వాసవీ గార్డెన్స్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేణుగోపాల్ మాట్లాడుతూ.. సాయి అంటే గురువని, అలాంటి గురువు అనుగ్రహం ఉంటే తలపెట్టిన అన్ని కార్యక్రమాలూ విజయవంతంగా సాగుతాయని తెలిపారు. దత్తాత్రేయ గురు చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్రను చదివితే జన్మజన్మల పాపాలకు ప్రక్షాళన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో సాయి భజన మండలి అధ్యక్షుడు గన్నవరపు నాగేశ్వరరావు, వేములపల్లి వెంకటేశ్వరరావు, కటకం చిన్నబాబు, చెరుకూరి కృష్ణమూర్తి, చిన్ని కృష్ణారావు, అర్వపల్లి నిరంజన్, పసుమర్తి లక్ష్మీనారాయణ, కొదుమూరి మధుసూదన్, దమ్మాలపాటి సుధాకర్, చెన్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.