ఖమ్మం స్పోర్ట్స్: నగరంలోని సర్దార్ పటేల్‌స్టేడియంలో జిల్లా జూనియర్ కళాశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లాస్థాయి క్రికెట్ జట్టును ఆదివారం ఎంపిక చేశారు. ఈ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 40 మంది క్రికెటర్లు పాల్గొనగా.. జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం జిల్లా జట్టుకు ఎంపికై న వారిని ప్రకటించారు. జిల్లా జట్టులో ఎస్.కె.అమర్, జి.రిషికేశ్, పి.శివకుమార్, బి.కృష్ణబాలాజీ, ఐ.లియో, ఎస్.రికేశ్, జె.మనోభిరాం, టి.లక్ష్మిధరణ్, పి.చక్రవర్త, వి.స్టీఫన్, కె.సిద్దికుమార్, ఆర్.జయవిష్ణుతేజ్, ఎం.రిషినవనీత్, పి.రాజేశ్, వి.నక్షత్‌కుమార్, టి.టి.సాత్విక్, స్టాండ్‌బైలుగా ఎస్.కె.ఫైసల్ ఇమ్రాన్, బి.శివరామకృష్ణ, బి.కౌశిక్‌కుమార్‌లు ఉన్నారు.