
మాట్లాడుతున్న మందా నర్సింహారావు
ఇల్లెందు: సింగరేణి సంస్థ సొమ్ము రూ. 29 వేల కోట్లను గత కేసీఆర్ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు ఆరోపించారు. ఆదివారం ఇల్లెందు జేకే ఓసీలో జరిగి న పిట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అందుకే లాభాల బాటలో ఉన్నా వేతనాల చెల్లింపునకు కటకట గా ఉందని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ విధానాల వల్లే బొగ్గు బ్లాకులు పైవ్రేటుకు వెళ్లాయని, వచ్చే 15 ఏళ్లలో సింగరేణి అంధకారంలోకి వెళుతుందన్నారు. గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఫైరవీల సంస్థగా మారిపోయిందని విమర్శించా రు. ఇల్లెందులోని పూసపల్లి ఓసీకి అనుమతి రాకపోయినా ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారని తెలిపారు. సింగరేణిలో బొగ్గు టన్ను రూ.4500 ఉంటే, అదానీ బొగ్గు టన్ను రూ.18వేలు ఉందని అన్నారు. టీబీజీకేఎస్ నా యకులు నైట్ డ్యూటీలు, ట్రాన్స్‌ఫర్లు, డిప్యూటేషన్లు, కారుణ్య నియమాకాలు ఇలా రకరకాల పేర్లతో కార్మి కుల నుంచి భారీగా వసూళ్లు చేశారని ఆరోపించారు. రామగుండంలో క్వార్టర్లు కూల్చి ఓ నేత చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారిని బదిలీ చేయించారని విమర్శించారు. సింగరేణిలో 50 వేల క్వార్టర్లు ఉన్నాయని అందులో 20 వేల క్వార్టర్ల అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. పోలీస్, అటవీ, రెవెన్యూ శాఖల అధి కారులకు క్వార్టర్లు ఇస్తున్నారని, వారు కరెంటు బిల్లులు కూడా కట్టడం లేదన్నారు. కార్మిక సమస్యల పరి ష్కారానికి కృషి చేసే సీఐటీయూను రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మాచర్ల గోపాల్, కృష్ణయ్య, ఎండీ అబ్బాస్, సిరాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
మోడీ, కేసీఆర్ విధానాలతోనే ప్రైవేట్‌కు బొగ్గు బ్లాకులు
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు