
నివాళులర్పిస్తున్న మంత్రి అజయ్‌కుమార్
వైరా: జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్‌కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి లింగాల కరుణమ్మ (85) అనారోగ్యంతో ఆదివారం వైరా మండలం కొస్టాలలో మృతి చెందారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు కమల్‌రాజ్ జెడ్పీ చైర్మన్ కాగా, రెండో కుమారుడు రవికుమార్ బీఆర్ అంబేడ్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కరుణమ్మ మృతిపట్ల రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. కొస్టాలలో కరుణమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కమల్‌రాజ్ సోదరులను ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఆర్‌జేసీ కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, పగడాల నాగరాజు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఆర్‌బీసీ చైర్మన్ నల్లమల వెంకటేశ్వరరావు, వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్, ఏఎంసీ చైర్మన్ పుసుపులేటి మోహనరావు, మున్సిపల్ వైస్ చ్మైర్మన్ ముళ్లపాటి సీతారాములు ఉన్నారు.

కరుణమ్మ (ఫైల్)