దార్శనిక ప్రణాళిక

లకారం ట్యాంక్‌బండ్‌పై నృత్యం చేస్తున్న విద్యార్థినులు - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దార్శనిక ప్రణాళిక.. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వాన దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రపథాన నిలవగా.. జిల్లా కూడా అన్ని రంగాల్లో గతంతో పోలిస్తే ప్రథమ స్థానానికి చేరింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ 21 రోజుల జరిగే వేడుకల్లో జిల్లా ప్రజలు మమేకం కావాలి.’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఇల్లెందు రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్ర హం, పెవిలియన్‌ గ్రౌండ్‌ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్‌ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఆతర్వాత అనంతరం తొమ్మిదేళ్ల ప్రగతి, భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలను వివరిస్తూ మంత్రి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

వ్యవసాయానికి జవసత్వాలు

ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో వ్యవసాయ రంగం జవసత్వాలు నింపుకుంది. జిల్లాలో 2014–15 ఏడాదిలో 1,63,180 ఎకరాల్లో సాగు ఉండగా.. 2,93,724 మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తి కాగా.. ఈ ఏడాది 2,89,899 ఎకరాల్లో పంటలు సాగై 7,24,747 మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తి చేసే స్థాయికి చేరాం. రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు రూ.3వేల కోట్లకు పైగా సాయం అందించాం. యాసంగి సీజన్‌లో 152 కేంద్రాల ద్వారా రైతుల నుంచి 55,926.80 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.

● జిల్లాలో రూ.205.37 కోట్లతో 27,369 గొర్రెల యూనిట్లు పంపిణీ చేయగా రెండో దఫా కార్యాచరణ సిద్ధమైంది. వందశాతం రాయితీపై 2016 నుంచి ఇప్పటివరకు రూ.16.63కోట్ల విలువైన చేపపిల్ల లు, రొయ్య పిల్లలను విడుదల చేయడంతో మత్స్యకారులకు లబ్ధి చేకూరింది.

● సీతారామ ప్రాజెక్టు పనులు ఈ ఏడాదిలోపే పూర్తి చేసి కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడమే కాక ఎన్నెస్పీలో నీటి లభ్యత ఉండని సమయాల్లో ఆయకట్టు స్థిరీకరణ కోసం పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుతో జిల్లాలో 1.43 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది.

● ధరణి పోర్టల్‌ ద్వారా జిల్లాలో 54,563 క్లయిమ్‌లకు గాను ఇప్పటి వరకు 47,198 క్లయిమ్‌లను పరిష్కరించాం. వ్యక్తిగత పీఓబీలకు సంబంధించి 15,816 దరఖాస్తుల్లో 15,366 అంగీకరిం చాం. అంతేకాక సుమోటోగా స్వీకరించిన పీఓబీల్లో 80 శాతం దరఖాస్తులు పరిష్కారమయ్యాయి.

● 2017 డిసెంబర్‌ 31 నుంచి వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్‌ను 24 గంటలు సరఫరా చేస్తున్నాం. కొత్తగా 49 సబ్‌స్టేషన్లు నిర్మించాం. ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా 1,043 మంది నాయీబ్రాహ్మణులు, 4,875 మంది రజకులకు లబ్ధి జరుగుతోంది. ఇక 286 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి ఆర్టిజన్లుగా నియమించాం.

● జిల్లాలో తొమ్మిది బస్తీ దవాఖానాలు, 161 పల్లె దవాఖానా ద్వారా వైద్యం అందిస్తున్నాం. కంటి వెలుగు రెండో విడతలో 5,91,503 మందికి పరీక్షలు చేసి 1,77,691 మందికి అద్దాలు పంపిణీ పూర్తయింది. 2017 నుంచి ఇప్పటి వరకు 64,650 మంది మహిళలకు కేసీఆర్‌ కిట్లు, రూ.44.69 కోట్ల ప్రోత్సాహక నగదు అందించాం.

● మన ఊరు –మన బడి, మన బస్తీ– మనబడి ద్వారా 426 పాఠశాలల్లో మొదటి విడత కింద రూ.178 కోట్లతో మౌలిక వసతులు కల్పించాం. 115 పాఠశాలలకు రూ.9లక్షల చొప్పున కేటాయించి డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేశాం.

● 2014–15 నుంచి ఇప్పటి వరకు 1,92,342 మంది ఆసరా లబ్ధిదారులకు రూ.2,518.87 కోట్లు, సీ్త్రనిధి ద్వారా 25,034 సంఘాల్లోని 2,50,340 మంది సభ్యులకు రూ.774.69 కోట్లు అందాయి. దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుగా చింతకాని మండలంలో 3,462 మందికి రూ.346.20 కోట్లు, నియోజకవర్గాల్లో 483 మందికి రూ.48.30 కోట్ల విలువైన యూనిట్లు మంజూరయ్యాయి.

● రహదారులు, భవనాల శాఖ ఖమ్మం డివిజన్‌ పరిధిలో రూ.2,276.72 కోట్లతో 368 పనులు మంజూరయ్యాయి. వీటిలో రూ.1,079.53 కోట్ల విలువైన 260 పనులు పూర్తయ్యాయి. రూ.180 కోట్లతో మున్నేరు నదిపై తీగెల వంతెన మంజూరైంది. రూ.1,566 కోట్లతో చేపట్టిన సూర్యాపేట–ఖమ్మం నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తికాగా.. ఖమ్మం–కోదాడ జాతీయ రహదారి, ఖమ్మం–దేవరపల్లి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

● ఖమ్మం లకారం చెరువులో రూ.8.75 కోట్లతో తీగెల వంతెన, రూ.25 కోట్లతో కొత్త బస్టాండ్‌, రూ.22.43 కోట్లతో కేఎంసీ భవనం, రూ.8.75 కోట్లతో ఏసీపీ ఆఫీస్‌ వద్ద, రూ.5.70 కోట్లతో కొత్త బస్టాండ్‌ వద్ద సమీకృత మార్కెట్లు నిర్మించాం. వైరాలో రూ.32.90 కోట్లతో, సత్తుపల్లిటీలో రూ.36 కోట్లతో, మధిరలో రూ.95 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.

ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అదనపు కలెక్టర్లు మధుసూదన్‌, స్నేహలత, మేయర్‌ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, డీసీసీబీ, సుడా, డీసీఎంఎస్‌ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్‌, రాయల శేషగిరిరావు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో

ప్రథమ స్థానంలో జిల్లా

ఈ ఏడాదిలో సీతారామ పనులు

పూర్తి చేస్తాం

‘మన బడి’తో 426 పాఠశాలల్లో

సౌకర్యాలు

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో

మంత్రి పువ్వాడ

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top