
59 పరుగులు చేసిన నవ్య
ఖమ్మం స్పోర్ట్స్: ఆల్ ఇండియా మహిళా టీ–20 క్రికెట్ టోర్నీ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తరప్రదేశ్‌తో తలపడిన తెలంగాణ జట్టు విజయం సాధించింది. దీంతో రెండు విజయాలు జట్టు ఖాతాలో జమ అయ్యాయి. తెలంగాణ–ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలంగాణ జట్టు పరి మిత ఓవర్లలో 217 పరుగులు చేసింది. జట్టులో నవ్య 59పరుగులతో సత్తా చాటించది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 78 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. ఆతర్వాత గుజరాత్–మహారాష్ట్ర జట్ల నడుమ మ్యాచ్‌లో గుజరా త్ పరిమిత ఓవర్లకు 74 పరుగులు చేయగా, అనంత రం బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర జట్టు లక్ష్యాన్ని సునా యసనంగా చేధించి విజయం సొంతం చేసుకుంది. కాగా, శనివారం నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయని టోర్నీ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్ తెలిపారు.