
విద్యార్థినులకు బహుమతులు అందిస్తున్న కలెక్టర్ గౌతమ్
ఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్‌లో ఈనెల 4నుంచి జరిగే జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీకి ఖమ్మం నుంచి ఎనిమిది క్రీడాకారులు అర్హత సాధించారు. ఈ మేరకు టోర్నీకి పిట్టల మోహిత్, పరిటాల జ్వలిత్, వంశీక, కె.హితేష్, ఈ.హరి, గద్దల సిరి, మామిడాల ధరణి, అన్వేష్ అర్హత సాధించగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు ఎస్.వారియర్ శుక్రవారం అభినందించారు. ఈకార్యక్రమంలో డీవైఎస్‌ఓ ఎ.పరంధామరెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల సునీల్, ఓలేటి సాంబమూర్తితో పాటు డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినులకు బహుమతుల ప్రదానం
ఖమ్మంరూరల్: ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో మండలంలోని కోదాడ క్రాస్‌రోడ్డులో ఉన్న గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు. క్రీడాకారులు కె.భవాని, టి.కావేరి, ఎం.స్వప్న, జె.అశ్విని, కె.అఖిల, బి.ప్రియాంకకు కలెక్టర్ గౌతమ్ బహుమతులు అందజేసి అభినందించారు. ప్రిన్సిపాల్ బి.ఝాన్సీరాణి, వైస్ ప్రిన్సిపాల్ అతీయాబేగంతో పాటు కృష్ణ, ఎస్‌ఎల్.శివజ్యోతి, వై.చామంతి తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులను అభినందిస్తున్న మంత్రి పువ్వాడ, తదితరులు