స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడ.. ఒకప్పుడు 41 మంది, ఇప్పుడు నలుగురే

Four Independent candidates in karnataka - Sakshi

రాజకీయ పార్టీల అభ్యర్థులు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి, మందీ మార్బలం, ప్రచారార్భాటంతో ఎన్నికల్లో హల్‌చల్‌ చేస్తారు. ఇవేమీ లేని అభ్యుదయవాదులు, ఔత్సాహికులు కూడా ఏ పార్టీ గుర్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ గెలిచేది మాత్రం తక్కువమంది. ఒకప్పుడు 40 మందికిపైగా ఉన్న  స్వతంత్ర శాసనసభ్యులు ఇప్పుడు నలుగురికి మించడం లేదు. పెద్ద పారీ్టల ధాటికి స్వతంత్రులు నిలవడం లేదు.  

కర్ణాటక: కన్నడనాట ప్రతి ఎన్నికల సమయంలో సత్తా చాటుతున్న స్వతంత్ర అభ్యర్థులు ఈసారి నామమాత్రమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ప్రతిసారి నంబర్‌ గేమ్‌కు అవసరమయ్యేది స్వతంత్రులే. కానీ 16 వ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో స్వతంత్ర ఎమ్మెల్యేల  అవసరం లేకుండా పోయింది.  

2018లో ఒక్కరు  
1985 నుంచి ఇప్పటివరకు వేలాది మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీచేశారు. కానీ గెలుపొందిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. 
2018 ఎన్నికల్లో 1,142 మంది స్వతంత్రులు పోటీచేయగా 3.96 శాతం ఓట్లు పొందారు, గెలిచింది మాత్రం ఒక్కరే.  
తాజా ఎన్నికల్లో 918 మంది స్వతంత్రులు, చిన్నపార్టీల నుంచి 693 మంది అభ్యర్థులతో కలిపి 1,611 మంది బరిలో నిలిచారు, గెలిచింది నలుగురు మాత్రమే.  
1967లో 41 మంది విజయం   
1957 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 251 మంది స్వతంత్రులు పోటీచేయగా వారిలో 35 మంది గెలుపొందారు.  
1962 లో 179 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేసి 27 మంది గెలిచారు. 
 1967 లో 331 మంది స్వతంత్రులు పోటీచేయగా ఏకంగా 41 మంది విజయకేతనం ఎగురవేశారు. ఇది ఇప్పటివరకు చారిత్రక రికార్డు. ఆ తరువాత నుంచి స్వతంత్రుల హవాకు బ్రేక్‌ పడింది.  

ప్రతిసారీ 25 లక్షల దాకా ఓట్లు  
1978లో అతి తక్కువ అంటే 9,40,677 ఓటర్లు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులకు ఓటేశారు.  
1967లో 21,29,786 ఓట్లు, 1999లో 26,66,444 ఓట్లు, 2013లో 23,13,386 ఓట్లు స్వతంత్రులకు వచ్చాయి.  
ఇప్పటి ఎన్నికల్లో 22,54,882 (5.81)   ఓట్లు స్వతంత్రులకు పడ్డాయి.  

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top