కోలారు: బేతమంగల గ్రామంలో కరగ మహోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వై.సంపంగి ఆధ్వర్యంలో పౌర కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో శ్రమిస్తున్న పంచాయతీ పౌర కార్మికులను గుర్తించి సన్మానించడం అందరి కర్తవ్యమన్నారు. సమాజ ఆరోగ్యంలో పౌర కార్మికులు గొప్ప పాత్రను పోషిస్తున్నారన్నారు. సమాజంలో పౌర కార్మికులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయమన్నారు. కార్యక్రమంలో టీఏపీసీఎంఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, డైరెక్టర్ పురుషోత్తం, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు మమతా గణేష్ తదితరులు పాల్గొన్నారు.


