రాహుల్ పని విమర్శించడమే
తుమకూరు: స్థానిక జేడీఎస్ ఎమ్మెల్యే సురేష్‌బాబు ఇప్పటికి 100 వారాల జనస్పందన ద్వారా అనేక సమస్యలను పరిష్కరించారని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి అన్నారు. చిక్కనాయకనహళ్లి తాలూకాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జనస్పందన యశస్వి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించడం తప్ప మరేమీ చేయరని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సరిగా ఉపయోగించుకోని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని విమర్శించే నైతికత లేదని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. మెదడు లేకుండానే ఒప్పందం చేసుకుంటారా? అని అన్నారు. అన్ని లాభనష్టాలను లెక్కించిన తర్వాత ప్రధాని మోడీ ఈ ఒప్పందంపై నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.
కేంద్రమంత్రి కుమారస్వామి


