మిస్సింగ్ కాదు.. ప్రియునితో పరారీ
శివాజీనగర: హాసన్ జిల్లాలో బేలూరు వద్ద పెళ్లికి వెళ్లి అదృశ్యమైన వివాహిత కేసులో అనూహ్య మలుపు ఇది. ప్రియునితో వెళ్లిపోయినట్లు తేలింది. వివరాలు.. బేలూరుకు చెందిన ప్రియాంక (29)ను కుణిగల్ తాలూకా యలియూరువాసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి బిహార్‌కు చెందిన వలస కార్మికుడు దేవిడ్ పరిచయం. అతడు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండగా ప్రియాంకతో అనైతిక సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరూ బిహార్‌కు పారిపోవాలని పథకం వేశారు. ఆ మేరకు ఫిబ్రవరి 12న చిక్కమగళూరు జిల్లాలో బంధువుల వివాహానికి వెళుతున్నానని సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు నగలతో వెళ్లింది. ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్‌లో చెప్పి స్విచాఫ్ చేసింది. ఆమె బట్టలు, బ్యాగు రోడ్డుపై పడేసి ప్రియునితో ఉడాయించింది. దీంతో శనివారం పోలీసులు అక్కడ చెరువులు, వాగుల్లో వెతికినా జాడ లేదు. చివరకు ప్రియాంక, డేవిడ్ మొబైళ్ల లొకేషన్‌ని తనిఖీ చేయగా, తుమకూరు జిల్లా కుణిగల్‌లో ఉన్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మహిళ ఆత్మహత్య
కోలారు: ఫినాయిల్ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముళబాగిలు తాలూకా భైరకూరు గ్రామానికి చెందిన చైత్ర (27) అనే వివాహిత ఆదివారం మృతి చెందింది. బెంగుళూరు రూరల్ జిల్లా ఆనేకల్‌కు చెందిన చైత్రను ముళబాగిలు తాలూకా భైరకూరుకు చెందిన బాలకృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే భర్త మొదటి భార్య, అత్త వేధిస్తున్నారనే ఆవేదనతో ఈ నెల 10న పినాయిల్ తాగింది. ఆమెను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. చైత్ర తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బాలకృష్ణ, అతని తల్లి, మొదటి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
మలుపు తిరిగిన వ్యవహారం


