రేపు కళ్యాణ కర్ణాటకలో చిత్రసంతె | - | Sakshi
Sakshi News home page

రేపు కళ్యాణ కర్ణాటకలో చిత్రసంతె

Feb 16 2026 7:17 AM | Updated on Feb 16 2026 7:17 AM

రేపు

రేపు కళ్యాణ కర్ణాటకలో చిత్రసంతె

హుబ్లీ: కళ్యాణ కర్ణాటకలో చిత్రలేఖనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కలబుర్గిలోని టౌన్‌ హాల్‌ ఎదురుగా సార్వజనిక ఉద్యానవనంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చిత్రసంతే కార్యక్రమం నిర్వహించనున్నారు. కలబుర్గిలో చిత్రలేఖనంపై ప్రత్యేకంగా కృషి చేస్తున్న మేటి కళాకారుడు షాహిద్‌ పాషా విలేకరులతో మాట్లాడారు. విజయనగర పరంపరలో భాగంగా కిన్నాళ, గరుడాద్రి, తదితర శైలి సాంకేతిక సురపుర, సంస్థాన గరుడాద్రి కళా జాతీయ స్థాయిని ఆకర్షించిందన్నారు. తొలిసారిగా కలబుర్గి నీలహార్డ్స్‌ శ్రీ మార్కెటింగ్‌ అసోసియేట్‌ బీదర్‌ సంయుక్త సౌజన్యం, కళాకారుల సహాయ సహకారాలతో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కళ్యాణ కర్ణాటక చిత్రసంతె ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి ప్రముఖులు అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ చిత్రసంతెలో కళాకారులు తమ కళాకృతులను అందుబాటులో ఉంచి కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరారు.

సామాజిక బహిష్కరణ

నుంచి విముక్తి కల్పించండి

రాయచూరు రూరల్‌: సాంఘిక దురాచారంతో 12 కుటుంబాలు సామాజిక బహిష్కరణకు గురైన ఘటన యాదగిరి జిల్లాలో చోటుచేసుకుంది. యాదగిరి జిల్లా శహపుర తాలుకాలో ఎనిమిదేళ్లుగా సమాజం నుంచి వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శహపురలోని జిహేశ్వర కళ్యాణ మంటపం, వ్యాపార దుకాణాల నుంచి ఏడాదికి రూ.25 లక్షలు ఆదాయం వస్తుంది. ఇందుకు సంబంధించిన సంబంధించిన లెక్కలు చెప్పాలని ప్రశ్నించినందుకు 12 కుటుంబాలను అధ్యక్షులు, పదాధికారులు సామాజిక బహిష్కరణ చేశారు. 20 కుటుంబాలకు గాను 8 కుటుంబాలు సంఘానికి జరిమానా కట్టడంతో తిరిగి గ్రామంలోకి చేర్చుకున్నారు. సామాజిక బహిష్కరణ నుంచి విముక్తి కల్పించాలని మరో 12 కుటుంబాలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. కనీసం ఇప్పటికై నా స్పందించి సామాజిక బహిష్కరణ నుంచి విముక్తి కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

తెలుగు భాషాభిమాని గోపాల కృష్ణయ్య మృతి

హోసూరు: ప్రముఖ సాహితీ వేత్త, నివృత్త ఉపాధ్యాయుడు కోదండ రామయ్య రెండవ కుమారుడు గోపాలకృష్ణయ్య (86) ఆదివారం ఉదయం మరణించాడు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన తన నివాసంలో కన్ను మూశారు. గోపాల కృష్ణయ్య తన తండ్రి అడుగు జాడల్లో నడిచి భాషా సాహిత్యానికి సేవలందించారు. గోపాల కృష్ణయ్య మృతికి ఆంధ్ర సాంస్కృతిక సమితి నిర్వాహకులు చంద్రశేఖర మాస్టారు, విశ్వనాథ్‌, అన్నయ్యప్పతో పాటు పలువురు సంతాపం తెలిపారు.

రేపు కళ్యాణ కర్ణాటకలో చిత్రసంతె1
1/2

రేపు కళ్యాణ కర్ణాటకలో చిత్రసంతె

రేపు కళ్యాణ కర్ణాటకలో చిత్రసంతె2
2/2

రేపు కళ్యాణ కర్ణాటకలో చిత్రసంతె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement