బీజేపీ మహిళా కార్యకర్త ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బీజేపీ కార్యకర్త ఇంట్లో మహిళా కార్యకర్త ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలబుర్గి తాలూకా నందికూర గ్రామంలో జరిగింది. కార్యకర్త మల్లినాథ్ ఇంట్లో జ్యోతి పాటిల్ అనే మహిళా కార్యకర్త ఇలా ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో మల్లినాథ్ ఇంట్లో లేడని సమాచారం. ఆమె కలబుర్గి తాలూకా బ్రహ్మపురి కాలనీ నివాసిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. ఫరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మల్లినాథ్‌ను విచారించే పనిలో ఉన్నారు.
సస్పెండ్ చేశారని
మహిళా హెచ్‌ఎం రోదన
దొడ్డబళ్లాపురం: రాజకీయ ఒత్తిళ్లతో తనను సస్పెండ్ చేశారని, న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక టీచర్ విలవిస్తోంది. వివరాలు.. బెళగావి తాలూకా హరగాపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సురేఖ ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. పాఠశాల ఎస్‌డీఎంసీ అధ్యక్ష ఎన్నికలను స్థానిక రాజకీయ నేత పవన్ పాటిల్ నిర్వహించాలని ప్రయత్నించాడు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ సురేఖ అడ్డుకున్నారు. దీంతో పగబట్టి రాజకీయ పలుకుబడితో తనను సస్పెండ్ చేయించాడని వీడియోలో తెలిపింది. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సురేఖ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
గుడ్లపై భయం, తగ్గిన
బేకరీ వ్యాపారం
శివాజీనగర: గత కొన్ని రోజుల నుండి కోడిగుడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయనే ప్రచారం తీవ్ర చర్చకు కారణమైంది. ఇది ప్రజల్లో భయాన్ని కలిగించింది. క్రిస్మస్, కొత్త ఏడాది పండుగ సీజన్‌లో కూడా బేకరీ వ్యాపారాన్ని ఓ మోస్తరుగా దెబ్బతీసింది. గుడ్డు మంచిదా, కాదా అని ఒక క్లారిటీ లభించేవరకు గుడ్లు, దాంతో చేసిన ఆహార పదార్థాల సేవనానికి దూరంగా ఉన్నారు. దీనివల్ల బెంగళూరులోని కాండిమెంట్స్, బేకరీల్లో 10 శాతం వ్యాపారం తగ్గినట్లు తెలిసింది. బేకరీ ఉత్పత్తుల్లో గుడ్లను విరివిగా వాడతారనేది తెలిసిందే. ఎగ్ పఫ్స్ కొనుగోళ్లు బాగా పడిపోయాయి. బేకరీల్లో కేక్ ఆర్డర్‌లు ముందులాగా రావడం లేదు. కేక్‌ల వ్యాపారం ఏమవుతుందోనని గందరగోళంలో వ్యాపారులు ఉన్నారు. గుడ్లు వాడని కేక్‌లు తయారు చేస్తున్నట్లు బేకరీలు ప్రచారం చేసుకుంటున్నాయి.
కాంగ్రెస్ పెద్దలపై
ద్వేష రాజకీయాలు తగవు
● కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా
కాంగ్రెస్ ధర్నా
శివాజీనగర: దేశంలో రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసుకొని కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల మీద కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరిత రాజకీయం చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. నగరంలో స్వాతంత్య్ర ఉద్యానవనంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ నేతృత్వంలో సత్యమేవ జయతే పేరిట ధర్నా జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ద్వేషపూరిత రాకీయం ఎక్కువ కాలం సాగదని అన్నారు. డీ.కే.శివకుమార్ మాట్లాడుతూ ద్వేష రాజకీయాలు చేసే నాయకులకు పోయేకాలం దగ్గర పడిందన్నారు. ఈడీని దుర్వినియోగం చేసి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల మీద తప్పుడు కేసులు పెట్టారని, దీని మీద పోరాటం చేస్తామని అన్నారు. కేంద్రం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి పేదలపై దాడి చేస్తోందన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ కుమ్మకై ్కనట్లు ఆరోపించారు. ఈ ఆందోళనలో పెద్దసంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ మహిళా కార్యకర్త ఆత్మహత్య
బీజేపీ మహిళా కార్యకర్త ఆత్మహత్య


