విద్యా బోధనపై రాష్ట్ర స్థాయి సదస్సు
హొసపేటె: విజయనగర కళాశాలలో అంతర్గత నాణ్యత హామీ సెల్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులందరికీ ఫలితాల ఆధారిత విద్య ద్వారా బోధన, అభ్యాసంలో నాణ్యతను అందించడం అనే అంశంపై ఒక రోజు రాష్ట్ర స్థాయి సదస్సును శనివారం నిర్వహించింది. కార్యక్రమాన్ని విజయనగర కళాశాల అధ్యక్షుడు మల్లికార్జున్ ఎన్.మైత్రి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ మహంతేష్ ఎన్. ఆరాధ్యమట్ అధ్యక్షత వహించారు. వర్క్‌షాప్ ఫెసిలిటేటర్‌గా ఉన్న ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ డి.రవికిరణ్ వర్క్‌షాప్, ఫలితాల ఆధారిత విద్యపై పరిచయ వ్యాఖ్యలు చేశారు. కొప్పళలోని ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ కళాశాలలో జర్నలిజంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రిసోర్స్ పర్సన్ సుధా హెగ్డే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కర్ణాటక నలుమూలల నుంచి తరలి వచ్చిన మొత్తం 180 మంది ఉపాధ్యాయులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. డాక్టర్ సుప్రియ, డాక్టర్ శ్రింగేష్, డాక్టర్ శివమల్లికార్జున, డాక్టర్ గాదెప్ప, అమృత్, డాక్టర్ శివప్రసాద్, తదితరులు హాజరయ్యారు.


