8 శాతం రిజర్వేషన్ కల్పించాలని ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించలేదని, సాంఘీక న్యాయంతో మాదిగ సముదాయాలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాదిగ దండోరా రాష్ట్ర సంచాలకుడు నరసప్ప డిమాండ్ చేశారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టినా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు వర్గీకరణ చేయడంలో మౌనం వహించడాన్ని ఖండించారు. ప్రభుత్వం నాగమోహన్ దాస్ కమిషన్ నివేదిక ఆధారంగా స్పందించడం లేదన్నారు. ఇంటింటికీ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మాదిగ అని జాబితాలో రాయించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కాగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
8 శాతం రిజర్వేషన్ కల్పించాలని ధర్నా


