త్వరితగతిన డ్యాం గేట్లను అమర్చండి
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంకు రూ.52 కోట్లతో చేపడుతున్న 33 క్రస్ట్‌గేట్ల అమరిక పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని నీటిపారుదల సలహా మండలి సబ్ కమిటీ సంచాలకుడు, సింధనూరు శాసన సభ్యుడు హంపన గౌడ బాదర్లి, రిటైర్డ్ ఇంజినీర్ జీ.టీ.చంద్రశేఖర్ పేర్కొన్నారు. వారు కొప్పళ తాలూకా హిట్నాల్ వద్ద పాపయ్య టన్నెల్‌ను పరిశీలించిన అనంతరం రాయచూరు జిల్లాలో పర్యటించి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వచ్చే ఖరీఫ్ నాటికి క్రస్ట్‌గేట్లు అమర్చే పనులను పూర్తి చేయాలన్నారు. టీంలతో కాంట్రాక్టర్లు 2026 మే నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. తుంగభద్ర డ్యాంకు 19వ నంబరు క్రస్ట్‌గేట్‌తోపాటు 33 క్రస్ట్‌గేట్లను మార్పు చేయాలన్నారు. తుంగభద్ర డ్యాంలో 23 టీఎంసీల నీటిని వినియోగించారన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ హార్డ్‌వేర్ టూల్స్, మిషనరీ ప్రాజెక్టు కంపెనీ ప్రతినిధుల సలహా మేరకు పశ్చిమ బెంగాల్‌లోని పరాక్ బ్యారేజీకి 124 క్రస్ట్‌గేట్లను అమర్చిన విషయాన్ని ప్రసాద్ ఆరు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే 241 కి.మీ.పొడవున ఉన్న ఎడమ కాలువ మరమ్మతు పనులకు రూ.430 కోట్లు ఖర్చు చేస్తారన్నారు. పాపయ్య సొరంగ మార్గం నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చవుతుందన్నారు.


