ప్రియుడు కాదు.. కర్కోటకుడు
● యువతిపై సామూహిక అత్యాచారం
దొడ్డబళ్లాపురం: ప్రేమపేరుతో యువతిని మభ్యపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాలేజీ విద్యా ర్థినిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ముగ్గురు దుండగులను మాగడి పోలీసులు అరెస్టు చేశారు. వికాస్, చేతన్, ప్రశాంత్ అరైస్టెన వారు. మాగడి నివాసి, బెంగళూరులో చదువుతున్న యువతిని (19)ప్రేమ పేరుతో లొంగదీసుకున్న వికాస్ ఆమె వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అనేకసార్లు లైంగికదాడి చేయడంతోపాటు తన స్నేహితులైన చేతన్, ప్రశాంత్‌లను కూడా పిలిపించుకుని అత్యాచారం చేయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.


