కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా? | - | Sakshi
Sakshi News home page

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?

Dec 19 2025 7:51 AM | Updated on Dec 19 2025 7:51 AM

కలెక్

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?

శివాజీనగర: కలెక్షన్‌ కింగ్‌ అంటే విజయేంద్ర. ఆయన తండ్రి బీ.ఎస్‌.యడియూరప్ప పేరును తుడిచివేసే వ్యక్తి ఎవరంటే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్రే.. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాలే అని డీసీఎం డీకే శివకుమార్‌ ఆరోపించారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి కాంగ్రెస్‌ హైకమాండ్‌ను సంతోషపరిచారన్న బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర విమర్శల మీద డీకే శివకుమార్‌ గురువారం బెళగావిలో అసెంబ్లీ ఆవరణలో ఘాటుగా స్పందించారు. విజయేంద్రకు అనుభవం లేదు, ఏ ఖజానా ఖాళీ అయ్యింది? వచ్చి అసెంబ్లీలో చెప్పాలి, తప్పించుకొని తిరగడం కాదు అని అన్నారు. మీ లావాదేవీలు, మీ ఖాతాలు విడమరచి చెప్పమంటారా? అని ఎద్దేవా చేశారు. విజయేంద్ర హద్దు, అదుపులో ఉండి మాట్లాడాలి. కలెక్షన్‌ కింగ్‌ అంటే విజయేంద్రే. ఆయన తండ్రి పేరును తగ్గించేస్తున్నారని డీకే తీవ్ర ఆవేశంతో ధ్వజమెత్తారు. బెళగావి అసెంబ్లీ సమావేశాలు చాలా సంతృప్తికరంగా జరిగాయి, చెరకు, మొక్కజొన్న రైతుల సమస్యలు తీరాయి అని అన్నారు.

చరిత్ర అంతా చెబుతా: యత్నాళ్‌

మరోవైపు బీజేపీ నేత విజయేంద్ర తనపై పరువు నష్టం కేసు వేస్తే బాగుంటుంది. అది చేస్తే ఆయన అసలు రంగును సవివరంగా కోర్టుకు తెలియజేస్తానని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ చెప్పారు. ఎమ్మెల్యే యత్నాళ్‌ నా కుటుంబానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఆయన మీద పరువు నష్టం కేసు వేస్తానని ఇటీవల విజయేంద్ర చెప్పడంపై ఇలా స్పందించారు.

డీకేది అధికార మదం: విజయేంద్ర

సీఎం సిద్దరామయ్య ఔట్‌గోయింగ్‌ సీఎం అంటూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర బెళగావిలో తీవ్ర విమర్శలు చేశారు. ఇది సీఎం సన్నిహతులకు చింత పుట్టించింది. అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ డీసీఎం డీకే శివకుమార్‌ మీద కూడా ఆరోపణలు గుప్పించారు. డీకే శివకుమార్‌ అధికార మదంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు, ఇతరుల మాదిరి నన్ను బెదిరించవద్దు. నేను ఎమ్మెల్యే, ఒక పార్టీ రాష్ట్రాధ్యక్షునిగా ఉన్నా. బీ.ఎస్‌,యడియూరప్ప మీద ఎలా కుట్ర పన్నారో తెలుసు, ఆ విషయాన్ని నేను మాట్లాడేలా చేయవద్దు అని అన్నారు. డీకే ద్వారా తాను పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవినీతి పితామహుడు ఎవరని అడిగితే రాష్ట్రంలో డీకే శివకుమార్‌ పేరు చెబుతారని విజయేంద్ర దుయ్యబట్టారు. తన గురించి మాట్లాడేటప్పుడు నాలుక అదుపులో పెట్టుకో అని మండిపడ్డారు. రోడ్డు గుంతలను మూసే యోగ్యత ఈ సర్కారుకు లేదు అని అన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఈ ప్రభుత్వం భర్తీ చేయనే లేదు అని ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలో ఖోఖో క్రీడాకారిణి చైత్ర కు రూ.5 లక్షల బహుమతి ఇస్తే ఇంత తక్కువ ఇస్తారా అని ఆమె తిరస్కరించారు, ఇదీ ఈ సర్కారు దుస్థితి అని విమర్శించారు. సిద్దరామయ్య ప్రభుత్వం మీద విజయేంద్ర గట్టిగా విమర్శించిన సందర్భాలు లేవు, దీనిమీద గతంలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయేంద్ర ఉగ్రరూపం చర్చనీయాంశమైంది.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వర్సెస్‌ బీజేపీ నేత విజయేంద్ర

బెళగావిలో పరస్పరం తీవ్ర ఆరోపణలు

గతంలో ఎన్నడూలేని పరిణామం

జగదీశ్వరి మాతకు డీకే పూజలు

దొడ్డబళ్లాపురం: సీఎ కుర్చీపై కన్నేసిన డీసీఎం డీకే శివకుమార్‌ ఇష్టార్థసిద్ధి కోసం దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా అంద్లెశ్రీ జగదీశ్వరి దేవి ఆలయంలో విశేష పూజలు జరిపించారు. గురువారం ఉదయం బెళగావి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గోకర్ణకు వచ్చి అక్కడి నుంచి కారులో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. పూజలు చేయించి మొక్కు తీర్చుకున్నారు. గతంలో జైలు నుంచి విడుదలైనప్పుడు, గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా డీకే ఈ దేవాలయాన్ని సందర్శించారు.

శివాజీనగర: ఆర్థిక శాఖ ద్వారా విడుదలైన రూ.5 వేల కోట్ల నిధులు ఎక్కడికి వెళ్లాయనే ప్రతిపక్షాల ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రూ.5 వేల కోట్ల సొమ్ము విడుదలే కానప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అని ఆమె జవాబిచ్చారు. ఫిబ్రవరి, మార్చి నెలల గృహలక్ష్మీ సొమ్ము లబ్ధిదారులకు పెండింగ్‌ పెట్టారని బుధవారం అసెంబ్లీలో గలాటా జరగడం తెలిసిందే. ఆర్థిక శాఖ నుంచి ప్రతి ఒకటో తేదీ గ్రాంట్‌ విడుదల అవుతుంది. నిధులు విడుదలైన తక్షణమే గృహలక్ష్మీ లబ్దిదారుల ఖాతాకు సొమ్ము వేస్తాం. ఆర్థికమంత్రి సీఎం కాబట్టి ఆయనే అసెంబ్లీలో సమాధానం ఇస్తారని ఆమె తెలిపారు.

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?1
1/4

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?2
2/4

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?3
3/4

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?4
4/4

కలెక్షన్‌ కింగ్‌ ఎవరో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement