యథేచ్ఛగా హనీట్రాప్
బనశంకరి/ కృష్ణరాజపురం: బెంగళూరులో నిర్భయంగా హనీట్రాప్ బాగోతాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ ఎట్టకేలకు కటకటాలకు చేరింది. రామూర్తినగర పోలీస్‌స్టేషన్ సీఐ సతీశ్‌ను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్న నిందితురాలు వనజ అలియాస్ సంజనను కేసు నమోదు చేసి బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. విచారణలో ఆమె నిర్వాకాలు అనేకం బయటపడినట్లు పోలీసులు చెప్పారు. హనీట్రాప్ దందాకు పాల్పడుతోందని తెలిపారు.
కాంట్రాక్టరుకు వలపు
సంజన డబ్బున్నవారితో స్నేహం చేసి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది, సన్నిహితంగా గడిపి ఫోటోలు, వీడియోలను తీసి వాటితో బ్లాక్‌మెయిల్‌చేసి అందినంత డబ్బు, బంగారం దోచుకుంటుందని చెబుతున్నారు. సతీష్ అనే ఓ కాంట్రాక్టర్ ను హనీట్రాప్ చేసి రూ.3 లక్షలు, బంగారు చైన్, బ్రేస్‌లెట్, ఉ ఉంగరం తీసుకుంది. బాధితుడు 2022లో రామమూర్తినగర ఠాణాలోనే ఫిర్యాదు చేశాడు. అంతేకాక అతని రెండు అంతస్తుల భవనం కాజేయడానికి కిలాడీ ప్రయత్నించడంపై కేఆర్.పురం పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు పెట్టాడు. ఇలా పలువురిని హనీట్రాప్ ఉచ్చులోకి లాగింది.
సీఐ మీద సైతం ప్రయోగం
కిలాడీ సంజనకు సంకెళ్లు
పెళ్లంటూ పోలీసుకు టోపీ
2018లో సంజన దావణగెరె హెడ్‌కానిస్టేబుల్ జగదీశ్‌ను పెళ్లి పేరుతో మోసగించడంతో వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమె బాధితుల జాబితాలో ఎంతమంది ఉన్నారని దర్యాప్తు చేపట్టారు. తాను కాంగ్రెస్ నాయకురాలినని, సీఎం, మంత్రులు తెలుసని దబాయించేది. చివరకు సీఐ సతీశ్‌ను వలలోకి లాగాలని చూసింది కానీ, తెలివిగా బయటపడ్డాడు.


