రక్షకులే భక్షకులు
= మూడేళ్లలో 88 మంది పోలీసులపై
నేరాభియోగాలు: హోంమంత్రి
శివాజీనగర: రాష్ట్రంలో ఇటీవల జరిగిన దోపిడీ, కిడ్నాప్‌లాంటి నేరాల్లో పోలీసులే పాల్గొనడం మీద కలవరం నెలకొంది. బెంగళూరులో ఏటీఎం సొమ్ము రవాణా వాహనాన్ని దోచుకోవడం, కోరమంగల కాల్‌సెంటర్ ఉద్యోగుల కిడ్నాప్‌లో పోలీసులు పాల్గొన్నట్లు తేలింది. గత మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 88 మంది పోలీసులు నేర కృత్యాలకు పాల్పడినట్లు హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బెళగావి అసెంబ్లీలో జేడీఎస్ ఎమ్మెల్సీ శరవణ అడిగిన ప్రశ్నకు హోం మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. కంచే చేను మేసినట్లు అవుతోంది. పోలీసులే దోపిడీలు, దొంగతనాలకు ఒడిగడుతున్నారు. రక్షకులే భక్షకులవుతున్న కారణాన పోలీసులపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారని సభ్యులు ఆరోపించారు. నేరాలలో పాల్గొన్న పోలీసులను సస్పెండ్ చేయటం కాకుండా ఉద్యోగం నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు.
సస్పెండ్ చేశాం
హోంమంత్రి బదులిస్తూ పోలీసులు అందరూ దొంగలు అనలేము. నేరాలతో పోలీసులు కుమ్మకై ్క ఉంటే విడిచిపెట్టేది లేదు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సస్పెండ్ చేశాం, పోలీసులు కట్టుదిట్టంగా ఉండటంతో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయన్నారు.
96 చోరీల గజదొంగ అరెస్టు
చిక్కబళ్లాపురం: హైదరాబాద్‌కు చెందిన గజదొంగ రాహుల్‌కుమార్ శర్మ ఆలియాస్ భరత్‌కుమార్ (38)ను చిక్కబళ్లాపురం పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయంగా పోలీసులకు దొరికాడు. వివరాలు.. శిడ్లఘట్ట పట్టణంలో ఉండే తోడుదొంగలు సంతోష్, అల్లాబకాష్‌లను చూడడానికి వచ్చాడు, అక్కడ గత నెల 27న అణకనూరు గ్రామంలోని నాగరాజ్ అనే ఇంటిలోకి చొరబడి బంగారు నగలు, డబ్బు ఎత్తుకెళ్లాడు. చిక్కబళ్లాపురం రూరల్ పోలీసులు విచారణ చేపట్టి శర్మ, అల్లాబకాష్, సయీద్‌లను అరెస్టుచేశారు. శర్మ హైదరాబాద్‌లో ఉంటూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఇప్పటికి 96 చోరీ కేసులు ఇతనిపై ఉన్నాయి. అరెస్టయిన ప్రతిసారీ కొన్నాళ్లు జైలుకెళ్లి రావడం, మళ్లీ దొంగతనాలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు.


