కోటిగానహళ్లి రామయ్య సేవలు అపారం
కోలారు: నగర సమీపంలోని తేరహళ్లి కొండపై బుడ్డిదీపలో బుడ్డిదీప సంస్థాపకుడు కోటిగానహళ్లి రామయ్య ఏర్పాటు చేసిన అంబేడ్కర్ హార్న్ బిల్ గ్రంథాలయం, హల్గి కల్చర్ తమట శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోటిగానహళ్లి రామయ్య ఈ వయసులోనూ సాహిత్య రంగానికి అందిస్తున్న సేవలు శ్లాఘనీయమన్నారు. చిన్నారుల్లో ఉత్తమ సంస్కారం నింపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అంబేడ్కర్ జీవిత చరిత్రను నాటకాల ద్వారా సమాజానికి పరిచయం చేస్తున్నారన్నారు. అనంతరం రామయ్య అనువాదం చేసిన రత్తు కండంతె అంబేడ్కర్ కొనెయ దినగళు పుస్తకాన్ని జేడీఎస్ నాయకుడు సిఎంఆర్ శ్రీనాథ్ ఆవిష్కరించారు.


