దివ్యాంగ విద్యార్థులకు వైద్య శిబిరం
కెలమంగలం: సంయుక్త విద్యా పథకం కింద క్రిష్ణగిరి జిల్లా కెలమంగలంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల దివ్యాంగ విద్యార్థులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని యూనియన్ సూపర్ వైజర్ సేతు, జిల్లా అంగవైకల్య సంక్షేమ శాఖ అధికారి మురుగేషన్, విద్యాశాఖ అధికారులు మదన్ కుమార్, నరసింహన్, మహేంద్రన్, గణేష్ ప్రారంభించారు. వైద్య నిపుణులు విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు జాతీయ గుర్తింపు కార్డు, ఉచిత బస్సు పాస్, తదితర సంక్షేమ పథకాలు అందించేందుకు వివరాలు సేకరించారు.


