రైతు మేళా జనసాగరం
వ్యవసాయ మేళా దారిలో రద్దీ
కీటకాల గురించి సమాచారం తెలుసుకుంటున్న సందర్శకులు
యశవంతపుర: బెంగళూరు జీకేవీకేలో నాలుగు రోజుల వ్యవసాయ మేళా– 2025 మూడో రోజు శనివారం జనసాగరంలా మారింది. శీతాకాలమైనా చుర్రుమనే ఎండలు కాస్తుండగా రైతులు, యువత, ప్రజలు మేళాను వీక్షించారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీకెండ్ కావడంతో రద్దీ అధికంగా ఉంది.
సమాచార వినిమయం
మేకలు, కోళ్లు, చేపల స్టాళ్లు, సేద్య ఉపకరణాల విక్రయ కేంద్రాలు, నూతన వంగడాల స్టాళ్లకు జన తాకిడి ఎక్కువగా ఉంది. ప్రజలు సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత చూపారు. సమీపంలో ఉండే ఏపీ, తమిళనాడు నుంచి కూడా రైతులు, ఔత్సాహికులు వచ్చారు. హళ్లికార్ ఎద్దులు, బన్నూరు గొర్రెలు, సోలార్ నీటి పంపింగ్ ఉపకరణాల గురించి తెలుసుకున్నారు. రాయితీలతో పనిముట్లను రైతులు కొనుగోలు చేశారు. మూడు రోజులల్లో 8 లక్షల మంది వరకు రైతులు ప్రజలు చేరి ఉంటారని అధికారులు అంచనా వేశారు. రూ. 12 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం.
ఆకలితీర్చే ఫుడ్ కోర్టు
వ్యవసాయ మేళాలో ఫుడ్ కోర్టులో రద్దీ ఏర్పడింది. ప్రదర్శనను వీక్షించి ఆకలితో వస్తున్నారు.
ఇందులోని ఆహారశాలల్లో రూ.50 కి అన్నం, ముద్ద, సాంబారును అందిస్తున్నారు. వివిధ వంటకాలను తక్కువ ధరలకే ఉంచడంతో గిరాకీ ఏర్పడింది.
బెంగళూరు జీకేవీకేలో రద్దీ
రైతు మేళా జనసాగరం
రైతు మేళా జనసాగరం
రైతు మేళా జనసాగరం


