ట్యాంకర్ల మధ్య ఆటో నుజ్జు
డివైడర్‌కు కారు ఢీ,
యశవంతపుర: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుమంది మరణించారు. ఉడుపి కృష్ణ మందిరానికి వెళుతున్న భక్తుల కారు బంట్వాళలో బీసీ రోడ్డు సర్కిల్ డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో బెంగళూరు పీణ్యకు చెందిన ముగ్గురు చనిపోగా, నలుగురు గాయపడ్డారు. రమ్య (23), రవి (64), నంజమ్మ (75) మృతులు, కీర్తీ, సుశీల, బిందు, ప్రశాంత్‌లు గాయపడి మంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పీణ్య నుంచి ఏడు మంది ఇన్నోవా కారులో ఉడుపికి బయలుదేరారు. బీసీ రోడ్డు, అడ్డహొళె హైవే పనులు జరుగుతున్నాయి. సర్కిల్‌ను అవైజ్ఞానికంగా నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్యాంకర్ల మధ్య ఆటో చిక్కుకొని
దక్షిణ కన్నడ జిల్లా పణంబూరు వద్ద ట్యాంకర్ల మధ్య ఆటో చిక్కుకొని ముగ్గురు దుర్మరణం చెందారు. రోడ్డుపై పశువు రావడంతో ట్యాంకర్ డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేశాడు, వెనుక వచ్చి ఆటో ఆ ట్యాంకర్‌ను ఢీకొంది, దాని వెనుక వస్తున్న మరో ట్యాంకర్ ఆటోను ఢీకొంది. రెండు వాహనాల మధ్య చిక్కి ఆటో నుజ్జయింది, అందులో వెళ్తున్న మహమ్మద్ కుంజె (25), అబూబకర్ (65), ఇబ్రహీం (68) అనే ముగ్గురు అక్కడే మరణించారు. మంగళూరు నగర పోలీసు కమిషనర్ సుధీర్‌కుమార్ రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు.
రెండు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
బంట్వాళ, మంగళూరులో ఘటనలు
ట్యాంకర్ల మధ్య ఆటో నుజ్జు


