కృష్ణజింకల మృత్యుఘోష
బనశంకరి: బెళగావి కిత్తూరు రాణిచెన్నమ్మ మృగాలయంలో 13వ తేదీ 8 కృష్ణ జింకలు, మళ్లీ శనివారం ఉదయం 20 జింకలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఏం జరుగుతోందో అనే ఆందోళన నెలకొంది. బెళగావి తాలూకా భూతరామనహట్టి వద్ద గల కిత్తూరు రాణిచెన్నమ్మ కిరుమృగాలయంలో జరిగింది. డీఎఫ్‌ఓ ఎన్‌ఈ క్రాంతి మాట్లాడుతూ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో కృష్ణజింకలు చనిపోయినట్లు చెప్పారు. బన్నేరుఘట్ట జూపార్క్ వైద్యనిపుణులు వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మొత్తం 28 జింకలు చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. ఈ జూలో మొత్తం 38 కృష్ణజింకలు ఉండగా ఇప్పుడు 10 జింకలు మాత్రమే మిగిలాయన్నారు. ఏసీఎఫ్ నాగరాజు బాళేహోసూర మాట్లాడుతూ జింకల కళేబరాలకు నిబంధనల ప్రకారం అంత్యక్రియలు జరిపామని తెలిపారు. మూడు కళేబరాలను మాత్రం భద్రపరిచామని, వాటికి బన్నేరుఘట్ట పశువైద్యులు పరీక్షలు చేస్తారన్నారు. నివేదిక వచ్చాక స్పష్టమైన కారణం తెలుస్తుందన్నారు. మిగిలిన జింకలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి విచారం
కృష్ణజింకల మరణాలపై అటవీశాఖమంత్రి ఈశ్వర్‌ఖండ్రే విచారం వ్యక్తం చేసి దర్యాప్తునకు ఆదేశించారు. అంటురోగమే కారణమని ప్రాథమికంగా తేలిందని చెప్పారు. మిగతావాటికి సోకకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
బెళగావి జూపార్క్‌లో 28 జింకలు...
అంతుబట్టని కారణాలు..
కృష్ణజింకల మృత్యుఘోష


