నేరాల నివారణకు జాగృతి అవసరం
రాయచూరు రూరల్: నేరాల నివారణకు జనజాగృతి అవసరమని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయం వద్ద మారథాన్ జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఇంటింటికీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు జాగృతి కల్గించి మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్‌ఎస్ సహాయవాణి 112, 1930 నంబర్ల వినియోగం ద్వారా ప్రజలు సహకరించాలన్నారు.
వల్లభాయి పటేల్
జీవితం ఆదర్శప్రాయం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో విద్యార్థులు పురాతన కాలం నాటి మహానుభావుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. బుధవారం టాగూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ స్మారక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయి పటేల్ ఉక్కు మనిషి అని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలను విద్యార్థులు జీవితంలో అలవర్చుకోవాలన్నారు. పెరుగుతున్న జనాభా ఆధారంగా దోపిడీలు, అత్యాచారాలు, చోరీలు వంటి దుర్ఘటనలు జరగకుండా నిఘా ఉంచడానికి నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శాంతవీర, సీఐ మేకా నాగరాజు, ఎస్‌ఐ మంజునాథ్‌లున్నారు.
విజయపురలో భూకంపం
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో మళ్లీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున విజయపుర జిల్లాలో పలు గ్రామాల్లో రిక్టర్ స్కేల్‌పై 3.0 పాయింట్లతో భూమి కంపించడంతో జనం భయాందోళన చెంది పరుగులు తీశారు. ఈ జిల్లాలో పదే పదే భూమి కంపిస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 11 సార్లు భూకంపం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. దీంతో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
రోడ్లలో గోతులున్నాయి జాగ్రత్త.!
రాయచూరు రూరల్ : గత రెండేళ్ల నుంచి జిల్లాలోని నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లలో పడిన గుంతలను మరమ్మతులు చేయడానికి, గుంతలు పూడ్చడానికి నిధుల కొరత ఏర్పడడంతో ప్రజా పనుల శాఖ అధికారులు రోడ్లలో గుంతలు అధికంగా ఉన్నాయి. వాహన చోదకులు జాగ్రత్తగా సంచరించాలని హెచ్చరిక బోర్డు వేసి సూచించడం ఆశ్చర్యం కల్గించింది. రాష్ట్ర సర్కార్ పంచ గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడస్తున్నా అభివృద్ధి పనులకు నిధుల లేమితో ప్రజలు సంచరించే రోడ్లలో పడిన గోతులను మరమ్మతు చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడంపై ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
నేరాల నివారణకు జాగృతి అవసరం
నేరాల నివారణకు జాగృతి అవసరం


