పార్టీ కార్యక్రమంలో ఉపాధ్యాయుల ప్రత్యక్షం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పార్టీ కార్యక్రమంలో వేదికపై కనిపించిన సంఘటన యాదగిరి జిల్లాలో ెనెలకొంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంలో జిల్లాధికారి, జిల్లా విద్యా శాఖాధికారులు మౌనం వహించడంపై ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లింగసూగూరు పీడీఓ ఆర్‌ఎస్‌ఎస్ కవాతులో పాల్గొన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యాదగిరిలో జరిగిన పార్టీలో వేదికపై పంచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


