వర్షాలకు ఇల్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

వర్షాలకు ఇల్లు ధ్వంసం

Oct 24 2025 2:32 AM | Updated on Oct 24 2025 2:32 AM

వర్షా

వర్షాలకు ఇల్లు ధ్వంసం

మండ్య: తాలూకాలోని కారిగానహళ్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఇల్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూలిపోయింది. సన్నకారు రైతు కాంతరాజు పెంకుటిల్లు మంగళవారం నుంచి కురిసిన వర్షానికి మట్టిగోడలు పూర్తిగా నానిపోయి కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ హాని జరగలేదు. ఇంటిలోని ధాన్యం, వంటపాత్రలు పాడయ్యాయి. రైతుకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

శిశువు చోరీ, మహిళ అరెస్టు

మైసూరు: ఆరు నెలల మగ శిశువును అపహరించిన ఓ మహిళను రైల్వే పోలీసులు బంధించి శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. హాసన్‌కు చెందిన నందిని (50) నిందితురాలు. బుధవారం రాత్రి శిశువుతో తల్లిదండ్రులు మైసూరు రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై నిద్రించారు. ఈ సమయంలో నందిని, ఆ శిశువును ఎత్తుకెళ్లింది. మేల్కొన్న తల్లిదండ్రులు బిడ్డ కనిపించలేదని రోదించసాగారు. రైల్వే పోలీసులు విచారించి వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ మహిళ ఆచూకీ లభ్యమైంది. గాలింపు చేపట్టి నందినిని అరెస్టు చేసి శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. ఎందుకు ఎత్తుకెళ్లిందో నిందితురాలిని తీవ్ర విచారణ చేస్తున్నారు.

సొంతూళ్ల నుంచి సిటీకి.. భారీ రద్దీ

శివాజీనగర: వీకెండ్‌, దీపావళి వరుస సెలవులతో సొంతూళ్లకు, టూర్లకు వెళ్లిన ప్రజలు పండుగ ముగించుకొని బెంగళూరుకు తిరుగుముఖం పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీపావళి వరుస సెలవుల నేపథ్యంలో గత శుక్రవారం నుంచి ప్రజలు తమ తమ స్వస్థలాలకు వెళ్లారు. పండుగ ముగించుకొని తిరిగి రావడంతో బుధ, గురువారాల్లో నగరంలో రద్దీ తీవ్రతరమైంది. మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు బారులుతీరారు. మెట్రో స్టేషన్‌ లోపల భాగంలో కూడా జనసందడి నెలకొంది. ఆ రైళ్లలో విపరీతమైన రద్దీ ఏర్పడింది.

వర్షాలతో ట్రాక్‌కు దెబ్బ, రైలుకు ఆటంకం

యశవంతపుర: చిక్కమగళూరు తాలూకా కణివె గ్రామం వద్ద రైలు పట్టాలకు వేసిన కంకర భారీ వర్షాల వల్ల కొట్టుకుపోయింది. బుధవారం రాత్రి మల్నాడులో కుండపోత వానలు కురిశాయి, కణివె గ్రామం వద్ద వాననీటి ధాటికి రైలు పట్టాల కిందనున్న మట్టి, కంకర పూర్తిగా కొట్టుకుపోయింది. పట్టాలు వేలాడుతూ ఉన్నాయి. గురువారం ఉదయం చిక్కమగళూరు నుంచి శివమొగ్గకు వెళ్లతున్న ప్యాసిజర్‌ రైలు కణివె వద్దకు వెళ్లగానే సిబ్బంది రైలును ఆపాలని సిగ్నల్‌ ఇచ్చారు. రైలు డ్రైవరు వెంటనే ఆపేశారు. సిబ్బంది రైలు పట్టాలను సరి చేసి రైలును పంపించారు. దీనివల్ల 45 నిమిషాలపాటు రైలు సంచారం నిలిచిపోయింది.

ఎద్దుల రేసుల్లో ప్రాణనష్టం

ముగ్గురి మృత్యువాత

దొడ్డబళ్లాపురం: దీపావళి ఉత్సవాల సందర్భంగా హావేరి నగరం పరిసరాల్లో బుధవారంనాడు భారీఎత్తున జల్లికట్టు తరహా ఎద్దుల రేసులు జరగడం తెలిసిందే. యువత, జనం పరుగులు తీసే ఎద్దులను పట్టుకోవడానికి పోటీలు పడ్డారు. అయితే ఇందులో విషాదాలు కూడా సంభవించాయి. మూడు వేర్వేరు ఘటనల్లో ఎద్దులు పొడిచి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దానేశ్వరి నగరలో ఎద్దుల రేసులో చంద్రశేఖర్‌ కోడిహళ్లి (75) అనే వృద్ధుడు వేడుకలను చూస్తూ ఉండగా ఎద్దు దాడి చేయడంతో చనిపోయాడు. దేవిహొసూరు గ్రామంలో జరిగిన వేడుకలో ఎద్దు పొడిచి ఘనిసాబ్‌ (75) అనే వృద్ధుడు మరణించాడు. పోటీలో పాల్గొన్న ఓ ఎద్దు ఇంట్లోకి జొరబడి ఈయనను పొడిచింది. హానగల్‌ తాలూకా తిళవళ్లిలో ఎద్దు దాడిలో భరత్‌ (24) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. వీరంతా జల్లికట్టులో పాల్గొనకపోయినప్పటికీ ఎద్దుల దాడుల్లో చనిపోయారు. స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు.

వర్షాలకు ఇల్లు ధ్వంసం  1
1/1

వర్షాలకు ఇల్లు ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement