రూ.5.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బనశంకరి: బెంగళూరులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.5.5 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. హెబ్బగోడిలో డ్రగ్స్‌ను పరిశీలించి వివరాలను వెల్లడించారు. నైజీరియా కు చెందిన డురో మిషెల్, ఇబు సామ్యేల్ అనే ఇద్దరు బిజినెస్ వీసాతో భారత్‌కు వచ్చారు. 2017 నుంచి బెంగళూరు హెబ్బగోడి ఠాణా పరిధిలో మకాం వేశారు.
తమిళనాడు నుంచి బట్టలు కొనుగోలుచేసి నైజీరియా కు ఎగుమతి చేసేవారు. మరోవైపు ఢిల్లీ నుంచి లగేజీ ద్వారా డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుని నగరంలోని కాలేజీల ముందు అమ్మి సొమ్ము చేసుకునేవారు. విదేశీ పోస్టల్ ఆఫీసుకు అనుమానాస్పద పార్శిల్స్ వచ్చినట్లు తెలిసి నిఘా పెట్టారు.
థాయ్‌లాండ్ నుంచి బిస్కెట్, చాక్‌లెట్ పార్శిళ్ల పేరుతో హైడ్రో గంజాయిని తెప్పించారు. ఈ నేపథ్యంలో దాడులు జరిపి ఇద్దరినీ అరెస్టు చేశారు. గంజాయితో పాటు రూ.2.50 కోట్ల విలువచేసే 1.47 కిలోల ఎండీఎంఏ క్రిస్టల్‌ను, రూ. 42 వేల నగదును పట్టుకున్నారు.
గతంలోనూ కేసు
కాగా వీరు గతంలో హెణ్ణూరు ఠాణా పరిధిలో డ్రగ్స్ అమ్ముతూ దొరికారు. విడుదలయ్యాక మళ్లీ పాత దందానే కొనసాగించడం గమనార్హం. పట్టుబడిన రూ.5.5 కోట్ల డ్రగ్స్ గురించి విచారిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చిన కేజీ నగరలోని విదేశీ తపాలా ఆఫీసులోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
బెంగళూరులో ఇద్దరు
నైజీరియన్ల అరెస్ట్
రూ.5.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత
రూ.5.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత


