మళ్లీ గణేశ చతుర్థి వచ్చిందోచ్
తుమకూరు: వినాయక చవితి ముగిసిన నెలల తరువాత మళ్లీ ఆ పండుగను ఆచరించడం ఆ గ్రామ విశిష్టత. ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజం. జిల్లాలోని చారిత్రక ప్రసిద్ధ గూళూరులో గణేశ మండపంలో మహా గణపతి విగ్రహాన్ని దీపావళి తరువాత బలిపాడ్యమి రోజున 18 కులాల ప్రజలు కలిసి ప్రతిష్టించి సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. ఇంకా నెల రోజుల పాటు భక్తులకు గణేష్ విగ్రహ దర్శనభాగ్యం లభిస్తుంది. గూళూరు మహా గణపతిని కార్తీక మాసంలో నెల రోజుల పాటు ప్రతిష్టించి ప్రతినిత్యం ప్రత్యేక పూజా కై ంకర్యాలు నిర్వర్తించడం ఆచారంగా వస్తోంది. స్వామివారికి ప్రతి కుటుంబం నిత్యం ప్రత్యేక అర్చనలు చేస్తారు. రోజూ రాత్రి 9 గంటలకు మహామంగళ హారతి ఇస్తారు. నవంబర్ 23వ తేదీ వరకు భక్తులకు దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు మహాగణపతి భక్తమండలి అధ్యక్షుడు జీఎస్ శివకుమార్ తెలిపారు.
గూళూరులో మహా గణపతి ఉత్సవాలకు శ్రీకారం


