పొలంలో చిరుత కూనలు
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా కెంపేగౌడనదొడ్డి గ్రామంలో కే.టి.ప్రతాప్ అనే రైతు పొలంలో మూడు చిరుత కూనలు కనిపించాయి. మద్దూరు అటవీ సిబ్బంది వచ్చి వాటిని తీసుకుని అడవిలోకి తరలించారు. తల్లి చిరుత కోసం గాలింపు చేపట్టారు.
బావిలో చిరుత
కెంపెయ్యనదొడ్డి గ్రామంలోనే మరో చిరుత ఘటన జరిగింది. ఉన్న కెంచేగౌడ అనె రైతు పొలంలోని పాడుబడిన బావిలో బుధవారం రాత్రి ఓ చిరుతపులి పడిపోయింది. దగ్గరిలోని బసవన కొండ అడవిలో నుంచి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు భావిస్తున్నారు. గురువారం ఉదయం దాని గాండ్రింపులు విని జనం వచ్చి చూసి అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి దానిని బంధించి తరలించారు. చిరుతను చూడడానికి వందలాది మంది పోగయ్యారు.


