ప్రత్యామ్నాయం చూపాలి
ఇలా వేగంగా పెరుగుతున్న జనాభా కారణంగా బెంగళూరులో మౌలిక వసతులు, ఇతరత్రా సౌకర్యాల కోసం తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఇళ్లు, స్థలాలు, రోడ్లు, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్ వంటి సమస్యలు ఇప్పటికే బెంగళూరును తీవ్రంగా బాధిస్తున్నాయి. జనాభా మరింత అధికమైతే ఈ సమస్యలు పరిష్కరించలేనంత స్థాయికి చేరుకుంటాయి. బెంగళూరు సరిహద్దులు వేగంగా విస్తరించాయి. కానీ సౌకర్యాలు ఆ స్థాయిలో లేవనేది అందరికీ తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో ప్రముఖులు, ప్రజలు తరచూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జనాభాకు తగినట్లు వసతులు అనేది సవాల్‌గా మారింది.


