భర్త వేధింపులు.. బావిలోకి దూకి..
రాయచూరు రూరల్: జీవితాంతం తోడునీడగా ఉంటానని కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసై చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె భరించలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పసికందుతో సహా బావిలోకి దూకి అత్మ హత్య చేసుకున్న ఘటన బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకా కెరూరు చెన్నమదేవి గుడి వద్ద జరిగింది. భర్త మస్తాన్‌సాబ్ (25), భార్య ఫాతిమా (21), కొడుకు అబ్దుల్ (3)తో కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. అతనికి అదివరకే పెళ్లయినా ఫాతిమాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఫాతిమాను చీటికిమాటికీ వేధించేవాడు, భరించలేక మూడురోజల క్రితం పుట్టింటికొచ్చింది. మంగళవారం సాయంత్రం కొడుకుతో సహా బావిలోకి దూకింది. స్థానికులు గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఆమె తల్లిదండ్రులు అల్లునిపై ఫిర్యాదు చేశారు.


