ఆస్పత్రిలో యంత్ర పరికరాల చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో యంత్ర పరికరాల చోరీ

Oct 23 2025 6:23 AM | Updated on Oct 23 2025 6:23 AM

ఆస్పత

ఆస్పత్రిలో యంత్ర పరికరాల చోరీ

రాయచూరు రూరల్‌: దేవదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ రకాల యంత్రపరికరాలు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.లక్షలాది విలువ చేసే యంత్రాలను, పరికరాలను సిబ్బంది వాటి గదికి తాళం వేయకుండా అలాగే వదిలి వేశారు. ఈ నెల 12న చోరీ జరిగినట్లు తాలూకా ఆరోగ్యాధికారి శివానంద ఈనెల 16వ తేదీన దేవదుర్గ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ిహిమోగ్లోబిన్‌ యంత్రం, ఆక్సిజన్‌ యంత్రం, ఎలక్ట్రోలైట్‌ పరీక్షలు నిర్వహించే పరికరాలు చోరీ కావడంతో పోలీసులు విచారణకు శ్రీకారం చుట్టారు.

వైభవంగా సిద్దరామేశ్వర జోడు రథోత్సవం

రాయచూరు రూరల్‌: తాలూకాలోని చిక్కసూగూరులో సిద్దరామేశ్వర జాతర, రథోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం చౌకి మఠం నుంచి దేవాలయం వరకు మహిళలు కుంభ కలశాలతో ఊరేగింపు జరిపారు. వీరగాసె నృత్యం చేస్తూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సిద్దరామేశ్వర జోడు రథోత్సవాన్ని వందలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం ముందు సిద్దలింగ మహాస్వామి, అభినవ రాచోటి శివాచార్యులు, మహాలింగ స్వామి, శిఖామణి అవధూత, వీర సిద్దస్వామి, విరుపాక్ష స్వామి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఇన్నోవా, స్విఫ్ట్‌ కారు ఢీ

త్రుటిలో తప్పిన ప్రమాదం

సాక్షి బళ్లారి: విజయపుర జిల్లా సింధిగి ఎమ్మెల్యే అశోక్‌ మనగూళి ఇన్నోవా, స్విఫ్ట్‌ కారు ఢీకొనడంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం సింధిగి బైపాస్‌ సమీపంలో ఎమ్మెల్యే ఇన్నోవా ఐక్రాస్‌ (కేఏ03–ఎన్‌టీ–2827 అనే నెంబర్‌ గల) కారుకు ఎదురుగా వస్తున్న స్విఫ్ట్‌ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారులో ఆయన కుమార్తె, సోదరుడి కుమారుడితో పాటు డ్రైవర్‌ ప్రయాణిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో ఎమ్మెల్యే అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1 నుంచి బెంగళూరు– హంపీ డైలీ విమాన సర్వీసు

హొసపేటె: బళ్లారి, విజయనగర జిల్లాల్లో పర్యాటకం, వ్యాపార రంగానికి పెద్ద ప్రోత్సాహాన్నిస్తూ, ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్‌ ఎయిర్‌ బెంగళూరు–హంపీని అనుసంధానిస్తూ కొత్త విమాన సర్వీసును ప్రారంభించాలని ప్రణాళిక ప్రకటించింది. చారిత్రాత్మక హంపీకి సమీపంలోని జిందాల్‌ విద్యానగర్‌ విమానాశ్రయం గుండా ఈ విమానాలు ప్రయాణిస్తాయి. కొత్త విమాన సర్వీసు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన హంపీకి కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. నవంబర్‌ 1న విమాన సర్వీసు ప్రారంభం కానుండటంతో బళ్లారికి కూడా ప్రయోజనం చేకూరుతుందని సమాచారం. స్టార్‌ ఎయిర్‌ ప్రకటన పర్యాటకులకు, స్థానిక వ్యాపారవేత్తలకు ఆనందాన్ని కలిగించింది. గతంలో అలయన్స్‌ ఎయిర్‌ హంపీ నుంచి బెంగళూరుకు రోజువారీ విమానాలను నడిపింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ సేవలు నిలిపివేశారు.

కార్తీకమాస పూజలు ప్రారంభం

అమరాపురం: మండలంలోని హేమావతి గ్రామంలో వెలసిన శైవక్షేత్రం శ్రీసిద్దేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాస పూజలను బుధవారం ఆలయ అర్చకులు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి సుప్రభాభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. అనంతరం భక్తులు తెచ్చిన వివిధ పూలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు ప్రసాద వినియోగం చేశారు.

ఆస్పత్రిలో యంత్ర  పరికరాల చోరీ1
1/3

ఆస్పత్రిలో యంత్ర పరికరాల చోరీ

ఆస్పత్రిలో యంత్ర  పరికరాల చోరీ2
2/3

ఆస్పత్రిలో యంత్ర పరికరాల చోరీ

ఆస్పత్రిలో యంత్ర  పరికరాల చోరీ3
3/3

ఆస్పత్రిలో యంత్ర పరికరాల చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement