ఇంటింటా దీపావళి కాంతులు
బళ్లారి రూరల్: భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనందోత్సాహాలతో కుల, మత, వర్గ, ధనిక, పేద అనే భేదాలు లేకుండా సమైక్యంగా జరుపుకొనే పండుగ దీపావళి. పండుగ నేపథ్యంలో దావణగెరెలో మంత్రి శామనూరు మల్లికార్జున, ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జునలు కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా పేల్చారు. ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున ముగ్గుపై మట్టిదీపాలు వెలిగించారు.
ఘనంగా దీపావళి వేడుకలు
హొసపేటె: నగర ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం రాత్రి ప్రజలు తమ ఇంటిలో లక్ష్మీ దేవిని కూర్చొండబెట్టి పూల మాలలతో విశేషంగా అలంకరించి పూజలు చేశారు. ఇంటి ముంగిళ్లలో దీపాలు వెలిగించడంతో పాటు ఇంటికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. టపాసుల శబ్దాలతో నగరం మారు మ్రోగిపోయింది.
ఇంటింటా దీపావళి కాంతులు
ఇంటింటా దీపావళి కాంతులు


