అందరి నోటా మోదీ బిల్డింగ్
హుబ్లీ: కర్ణాటక మెడికల్ కాలేజీ(కేఎంసీ) ఆస్పత్రికి వచ్చే అత్యధిక రోగుల నోటి నుంచి వచ్చే తొలి మాట వమోదీ బిల్డింగ్. 5 అంగశాస్త్ర ప్రత్యేక విభాగాలు కలిగిన ఈ 5 అంతస్తుల అత్యాధునిక భవనంలో శరీరంలోని కీలక అవయవాలకు సంబంధించిన ప్రత్యేక విభాగాలతో అత్యంత అనుభవజ్ఞులైన ఎండీ, ఎంబీబీఎస్, ఆపై ఉన్నత వైద్య విద్యా కోర్సులు చేసిన నిపుణులైన వైద్యులు 24 గంటలూ ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఆ మోదీ బిల్డింగ్‌లో వేలాది మంది పునర్జన్మ పొందారు. కన్నీటిమయంగా మారిన క్యాన్సర్ రోగులు, వారి సహాయకులు ఆ విభాగంలోని వార్డులలో రేడియేషన్, కిమోథెరపీ తదితర అత్యాధునిక చికిత్సలతో పాటు మిగతా మూడు వేర్వేరు అవయవాలకు సంబంధించిన విభాగాల్లో కూడా నిపుణులైన వైద్య బృందం నిరంతరం విధుల్లో ఉంటారు. ముఖ్యంగా ఎండీ పూర్తి చేసి వచ్చిన యువ వైద్యులు, మొదటి, రెండవ, మూడవ ఏడాది చదివే సంబంధిత ఎండీ విద్యార్థులు ఇక ఎంతో కష్టపడి 5 ఏళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసిన మెరిట్ విద్యార్థులు ఒక ఏడాది పాటు వీరికి ఇంటర్న్‌షిప్ లేదా హౌస్‌సర్జన్లుగా కేవలం నెలకు రూ.30 వేల స్టైఫండ్ తీసుకొని క్యాంపస్ ఆవరణలో 24 గంటలూ ఉంటూ వైద్యంపై అధ్యయనం చేస్తూ రోగులకు ఎంతో సేవలు అందిస్తారు. ముఖ్యంగా పేషెంట్ల సహాయకులు ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు.
కేఎంసీలో తీవ్ర అనారోగ్య బాధితుల పాలిట పునర్జన్మ కేంద్రం
5 కీలకాంగ శాస్త్ర విభాగాలతో
రోగుల పాలిట ఆరోగ్య పెన్నిధి


