దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదం
● మూడు బైక్‌లు దగ్ధం, ఏడుగురికి గాయాలు
సాక్షి బళ్లారి: బాగలకోట నగరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఇంటి ముందు దీపాలు వెలిగించే క్రమంలో అగ్ని ప్రమాదం జరగడంతో మూడు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. 7 మందికి గాయాలు అయ్యాయి. బాగలకోట నగరంలో రాజేంద్ర అనే వ్యక్తి ఇంటి ఎదురుగా దీపాలు వెలిగించాడు. ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించడంతో పాటు గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన ఇంట్లో వారు పరుగులు తీయడంతో ప్రాణాలను దక్కించుకున్నారు. అయితే 7 మందికి గాయాలు అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. రాజేంద్ర బోర్‌వెల్ పనుల కోసం తెచ్చిన ఆయిల్ దీపాలకు తగలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై బాగలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నకలీ ఓటర్ల జాబితా దగ్ధంపై విచారణ
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా అళందలో మాజీ శాసన సభ్యుడు సుభాష్ గుత్తేదార్ నివాసంపై ఎస్‌ఐటీ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు చేశారు. నకలీ ఓటరు జాబితా తెచ్చి కాల్చిన అంశంపై విచారణ చేపట్టారు. ఓటరు రికార్డులు తెచ్చిన గూడ్స్ వాహనాన్ని అళంద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యంతో ప్రాణనష్టం
హొసపేటె: ఆంధ్ర సరిహద్దు నుంచి తీసుకొచ్చిన సీహెచ్ పౌడర్‌తో మద్యం తయారు చేసి అక్రమంగా అమ్ముతున్నారు. దీని వల్ల జిల్లాలో యువకులు మరణిస్తున్నారని ఎంపీ ఈ.తుకారాం అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం కూడ్లిగి పట్టణంలోని శ్రీమతి అంగడి వీరమ్మ తిరుకప్ప ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో జిల్లా స్థాయి దిశ (అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ) సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. పోలీసులు శాఖ సరిహద్దులో చెక్ పోస్ట్ ప్రారంభించి సీహెచ్ పౌడర్ రవాణాను అరికట్టాలని ఎస్పీ జాహ్నవిని ఆదేశించారు. ఎకై ్సజ్, పోలీసులు శాఖలు దీనిపై నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌టి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎకై ్సజ్ శాఖ వెంటనే మేల్కోని అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకోవాలన్నారు. లంపీ వ్యాధి నివారణకు మందుల కొరత ఉంటే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లతా మల్లికార్జున, జిల్లాధికారి కవితా ఎస్ మన్నికేరి, జిల్లా పంచాయతీ అధికారి మొహమ్మద్ నోయంగ్జాయ్ అక్రమ్ అలీషా, ఎస్పీ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.
రెండు ద్విచక్ర వాహనాల ఢీ
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా బనవికల్లు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బనవికల్లు సమీపంలోని జాతీయ రహదారి–50పై శనివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో మోహన్ (27) తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని చికిత్స నిమిత్తం కూడ్లిగి తాలూకా ఆస్పత్రిలో చేర్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. కానహోసల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
డీసీసీ బ్యాంక్ ఎన్నికల్లో వర్గపోరు
సాక్షిబళ్లారి: బెళగావి డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ముందు నుంచి బెళగావి అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలు ఉండటంతో ఈ ఎన్నికల్లో పతక స్థాయికి చేరుకున్నాయి. జార్కిహొళి సోదరులు లక్ష్మణ సవధి, ఉమేష్ కత్తి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జార్కిహొళి వర్గానికి చెందిన అప్పాసాహెబ్ వ్యతిరేకంగా ఓటు లేని వారు ప్రవేశించడంతో గొడవ మొదలైంది. రాయబాగ్ తాలూకా డైరెక్టర్ స్థానానికి బసగౌడ రంగంలోకి దిగడంతో ఈయన సౌది, కత్తి వర్గం తరఫున పోటీ చేయడంతో బసగౌడ వర్గీయులు ఘర్షణకు దిగారు. హోటల్ ముందు లక్ష్మణ సౌది–జారికెహొళి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను కట్టడి చేశారు.
దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదం


