నిందితులపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: విజయపుర జిల్లా ముద్దే బిహళ్ తాలుకా బనోశిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై చర్యలు చేపట్టాలని చలువాది మహిళా మహాసభ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చలువాది మహిళా మహాసభ అధ్యక్షురాలు అర్చన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. ఉద్యోగం ఇచ్చి, ఇల్లు, భూమి మంజూరు చేయాలన్నారు. స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు.
రహదారి నిర్మించాలి
రాయచూరు రూరల్: దేవదుర్గ తాలుకా గబ్బూరు–గూగల్ వంతెన వరకూ రోడ్డు అధ్వానంగా మారింది. వెంటనే రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కర్ణాటక రైతు, వ్యవసాయ సంరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఇంజనీరింగ్ విభాగం అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కర్ణాటక రైతు, వ్యవసాయ సంరక్షణ సమితి అధ్యక్షుడు మస్తాన్ నాయక్ మాట్లాడుతూ.. రహదారి మరమ్మతులు చేపడితే యాదగిరికి 50 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. వెంటనే రహదారి పనులు చేపట్టి, సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం ఇంజనీర్ వెంకటేష్ గలగకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంగమేష్ నాయక్, శామిల్, మూసా, శివరాజ్, తిమ్మప్ప నాయక్, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.
యేహోవా మందిరంలో ప్రార్థనలు
హుబ్లీ: స్థానిక శాంతి నగర్‌లోని యేహోవా ప్రార్థన మందిరంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బ్రదర్ రాబిన్, మంజునాథ్ మాట్లాడుతూ.. వివిధ అధ్యాయాల్లోని సంబంధిత వచనాలను చక్కగా వివరించారు. ప్రత్యేక ప్రార్థన కూటముల్లో పాల్గొనాలని సూచించారు. అందరి మేలు కోసం నిత్యము ప్రార్థనలు చేయాలన్నారు.
నిందితులపై చర్యలు తీసుకోండి


