పీఎస్‌ఐ తిమ్మప్ప జోగి మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హువినహడగలి తాలూకా హిరేహడగలి పోలీస్ స్టేషన్ క్రైమ్ బ్రాంచ్ పీఎస్‌ఐ తిమ్మప్ప జోగి (59) శనివారం రాత్రి కన్ను మూశారు. ఈయన కొన్ని రోజులుగా హార్ట్‌స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. హరపనహళ్లి పట్టణానికి చెందిన తిమ్మప్ప గత 32 సంవత్సరాలుగా పోలీసు శాఖలో సేవలందించారు. అంత్యక్రియలు విజయనగర జిల్లాలోని హరపనహళ్లి పట్టణంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. తిమ్మప్ప జోగి మృతిపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్.జాహ్నవి, అదనపు ఎస్పీ జి.మంజునాథ్, హరపనహళ్లి డీవైఎస్పీ వెంకటప్ప నాయక్, హోస్పేట డీవైఎస్పీ డాక్టర్.టి.మంజునాథ్, కూడ్లిగి డీవైఎస్పీ మల్లేష్ దొడ్డాని, ఇతర పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.
‘బతికుండగానే చంపేశారు’
● రేషన్ కార్డులో విద్యార్థిని చనిపోయినట్లు నమోదు చేసిన అధికారులు
హుబ్లీ: హావేరిలో విద్యార్థిని బతికి ఉండగానే రేషన్ కార్డులో చనిపోయినట్లు అధికారులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆటో డ్రైవర్ మహబూబ్ సాబ్ తన పెద్ద కుమార్తె సుహానకు రేషన్ ఇవ్వక పోవడంతో విచారించడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే తన పెద్ద కుమార్తె మూడున్నర ఏళ్ల క్రితమే మృతి చెందినట్లుగా రేషన్ కార్డు రికార్డుల్లో నమోదు కావడం గుర్తించాడు. వెంటనే సమస్యను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. సుహాన పేరు రేషన్‌కార్డులో లేకపోవడంతో స్కాలర్‌షిప్, ఇతర పథకాలు అందడం లేదని మహబూబ్ సాబ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు స్పందించి వెంటనే రేషన్‌కార్డులోకి పేరు చేర్చాలని కోరుతున్నాడు.
పీఎస్‌ఐ తిమ్మప్ప జోగి మృతి


