పంట నష్ట పరిహారం చెల్లించాలి
రాయచూరు రూరల్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేవారు. ఆదివారం బీదర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఈశ్వర్ ఖండ్రే నివాసం ముందు శాసన సభ్యుడు ప్రభు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతివృష్టితో కలబుర్గి, బీదర్, యాదగిరి, రాయచూరు జిల్లాలో పంట నష్టం సంభవించిందన్నారు. పత్తికి క్వింటాల్‌కు రూ.10 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. రైతులు తీసుకున్న రుణాలను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని తెలిపారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రం అందజేశారు.


