
టీచర్ ఆత్మహత్య!
యశవంతపుర: ఉపాధ్యాయురాలు ఇంటిలో అనుమానాస్పద రీతిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొడగు జిల్లా నాపోక్లు పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఎమ్మెమాడులో జరిగింది. స్థానికుడు నజీర్ భార్య ఉపాధ్యాయురాలు సఫ్రీనా షేక్ (32), అక్కడి కర్ణాటక పబ్లిక్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసేది. బుధవారం అర్ధరాత్రి ఉరి వేసుకోగా, భర్త నజీర్ చూసి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించిట్లు చెప్పాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు మడికెరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తల గొడవలే కారణమని తెలిసింది. మృతురాలి తల్లిదండ్రులు అల్లుడే హత్య చేసి నాటకం ఆడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.